EPAPER

Suryakumar Yadav: ‘నాకు కెప్టెన్ గా ఉండాలని లేదు’.. శ్రీలంక మ్యాచ్ విజయం తరువాత సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav: ‘నాకు కెప్టెన్ గా ఉండాలని లేదు’.. శ్రీలంక మ్యాచ్ విజయం తరువాత సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav: శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు కెప్టెన్ గా ఉండాలని లేదని.. కేవలం ఓ నాయకుడిగా అందరూ గుర్తిస్తే చాలని అన్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ తడబడుతున్నట్లు అనిపించిన సమయంలో కెప్టెన్ గా సూర్యకుమార్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా పనిచేశాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.


214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్ ఓపెనర్లు పాథుమ్ నిస్సాంకా, కుసల్ మెండిస్ తమ అరాచక బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించారు. దీంతో శ్రీలంక ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని అనుకున్నారంతా. తొమ్మిదో ఓవర్లో వికెట్ కోల్పోకుండా 84 పరుగులు సాధించిన శ్రీలంక ఓపెనర్లు ఇక గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ శకానికి తొలిలోనే చేదు అనుభవం అందిస్తున్నట్లు అందరిలో భావన కలిగింది.

పైగా ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున కేవలం అయిదుగురు బౌలర్లు రంగంలోకి దిగడంతో సూర్యకుమార్ కు బౌలింగ్ విషయంలో పెద్దగా ప్రత్యామ్నాలు లేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్ష్ దీప్ సింగ్ చేత బౌలింగ్ చేయించాలని సూర్యకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఓవర్లో అర్షదీప్ మెండిస్ వికెట్ పడగొట్టి.. సూర్యకుమార్ సరైన నిర్ణయం తీసుకున్నాడని నిరూపించాడు. అయినా శ్రీలంక స్పీడు తగ్గలేదు.


మళ్లీ అక్సర్ పటేల్ ని 15వ ఓవర్లు బౌలింగ్ చేయమని సూర్యకుమార్ చెప్పడంతో.. కుసల్ పరేరా ఔటయ్యాడు. దీంతీ లంక బ్యాటింగ్ వేగం తగ్గింది. అయితే సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే రియాన్ పరాగ్ చేతిలో బాల్ పెట్టడం. బ్యాటింగ్ లో విఫలమైన రియాన్ పరాగ్ తన స్పిన్ బౌలింగ్ తో మూడు వికెట్లు తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అది కూడా 8 బంతుల్లోనే.

Also Read| Ind vs SL 2nd T20I Match Highlights: రెండో టీ 20లో టీమ్ ఇండియా గెలుపు.. సిరీస్ మనదే

టీమిండియా మ్యాచ్ విజయం తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రియాన్ పరాగ్ ని తాను నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు చూశానని.. అతను అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేయగలడని తనకు నమ్మకుముందని తెలుపుతూ… ఐపిఎల్ లో రియాన్ పరాగ్ బౌలింగ్ మ్యాజిక్ ని గుర్తు చేశాడు. అందుకే రియాన్ ఈ మ్యాచ్ లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని ప్రశంసించాడు.

అయితే ఈ మ్యాచ్ తరువాత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. సూర్యకుమార్ లో మంచి కెప్టెన్ ఉన్నాడని.. అతని నాయకత్వ నైపుణ్యం భారత జట్టుకు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ విషయంపై స్పందిస్తూ.. సూర్యకుమార్ యాదర్ ఒక ట్వీట్ చేశాడు. తనకు కెప్టెన్ గా ఉండాలని లేదని.. తనకు ఒక మంచి నాయకుడిగా అందరి మద్దతు అవసరమని తన ట్వీట్ లో రాశాడు.

Also Read: ‘ఆ విజయం కోసం ఆమె ఎంతో కష్టపడింది’.. మనూ భాకెర్ విజయంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్..

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×