EPAPER

KKR Vs SRH IPL 2024 Final Match: హైదరాబాద్ Vs కోల్‌కతా.. నీ యవ్వ తగ్గేదే లే.. కమిన్స్ కప్పు తే!

KKR Vs SRH IPL 2024 Final Match: హైదరాబాద్ Vs కోల్‌కతా.. నీ యవ్వ తగ్గేదే లే.. కమిన్స్ కప్పు తే!

IPL 2024 Final Match- Sunrisers Hyderabad Team Previews: సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఓ పడిలేచిన కేరటం.. లాస్ట్‌ సీజన్‌లో అట్టడుగున ఉన్న ఈ టీమ్.. ఇప్పుడు రయ్‌.. రయ్‌ మంటూ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తాడో పెడో తేల్చుకోనుంది. అసలు రైజర్స్‌ రైజింగ్‌ వెనక రీజన్సేంటి. లాస్ట్ సీజన్‌కి.. ఈ సీజన్‌కి మారిందేంటి.. ? 2023 ఐపీఎల్ సీజన్‌ SRHకు ఓ పీడకల.. 14 మ్యాచ్‌లు ఆడితే.. గెలిచింది కేవలం 4 మ్యాచ్‌లే.. ఇప్పుడా కౌంట్ డబుల్ అయ్యింది. ఫామ్‌లో.. జోష్‌లో.. ఎక్కడా తగ్గడం లేదు SRH. క్వాలిఫైయర్‌ వన్‌ మ్యాచ్‌లో ఓడినా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి మళ్లీ ఫైనల్‌ చేరింది. ఎక్కడ ఓడిందో.. మళ్లీ అదే టీమ్‌ను మట్టికరిపించింది.. కప్పు ఎత్తేందుకు సిద్ధమైంది.


స్టాట్స్‌.. సెంటిమెంట్స్.. ఇలా ఎందులో చూసుకున్నా హాట్ ఫెవరేట్‌ టీమ్‌ SRH.. ఒక్కసారి కాస్త పాస్ట్‌కి వెళదాం. ఐపీఎల్‌ స్టార్టయ్యింది 2008లో.. అప్పుడు హైదరాబాద్‌ టీమ్‌ పేరు డక్కన్ చార్జర్స్.. ఆ సీజన్‌లో కూడా పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌లో ఉంది డీసీ.. బట్ నెక్ట్స్ సీజన్‌లో కప్పు కొట్టేసింది. ఇప్పుడు కూడా అదే సీన్ రీపిట్ అవుతుంది చూడండి అంటూ అభిమానులు ముందే సంబరాలకు రెడీ అయిపోయారు. 2023లో పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్ SRHది. ఆ లెక్కన చూసుకుంటే కప్పు మనదే కదా మరి.

నిజానికి సీజన్ స్టార్టింగ్‌లో ఉన్న టీమ్ సిట్యూవేషన్‌కి.. ఇప్పటికి అసలు సంబంధమే లేదు. అయితే కథ ఎక్కడ మొదలైందో.. మళ్లీ అక్కడికే వచ్చి ఆగినట్టు ఉంది పరిస్థితి.. ఎందుకంటే ఫైనల్స్‌లో తలపడేది కోల్‌కత్, హైదరాబాద్ కాబట్టి.. ఈ సీజన్‌లో ఈ రెండు టీమ్స్.. హెడ్ టు హెడ్ మ్యాచ్‌తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఫోర్స్‌ తేడాతో మ్యాచ్‌ ఓడింది హైదరాబాద్. అయితే కేకేఆర్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.


Also Read: యూఎస్‌కు బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు, కాకపోతే..

ఈ సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌లో ఉంది ఆ టీమే.. క్వాలిఫైయర్ వన్‌ మ్యాచ్‌లో SRHను బీట్ చేసి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లారు. ప్రివియస్‌గా కేకేఆర్‌ మూడు ఫైనల్స్‌ ఆడితే 2012, 2014లో.. రెండింటిలో గెలిచారు. 2021 ఫైనల్స్‌లో మాత్రం ఓడారు. ఫైనల్స్‌లో 200 రన్స్‌ను చేజ్ చేసిన టీమ్.. KKR.. ఫైనల్స్‌లో ఇంత టార్గెట్‌ను చేజ్ చేసిన రికార్డ్‌ ఇప్పటికి కూడా అదే టీమ్‌ది. ఇక ఇండియాలో ఆడిన ఏ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ ఇంత వరకు ఓడిపోలేదు KKR.. 2021లో ఓడింది కూడా దుబాయ్‌లోనే.. సో.. ఈ సెంటిమెంట్‌ కాస్త కంగారు పెడుతోంది.

మరి ఈ రికార్డులను చూసి మనం భయపడలా.. నో.. నెవ్వర్.. రికార్డులు నెలకొల్పాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా.. మన టీమ్‌ను మించిన వారు లేరుగా.. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌.. SRH..ఇప్పటికే రెండు సార్లు పవర్ ప్లే 6 ఓవర్లలో 100 పరుగులు దాటించింది. ఐపీఎల్ చరిత్రలో తక్కువ బాల్స్‌లో టార్గెట్‌ను చేజ్‌ చేసిన టీమ్.. SRH.. హెడ్, అభిషేక్ ఇద్దరూ కలిసి కేవలం 62 బాల్స్‌లోనే 166 పరుగులను చేజ్‌ చేసి పారేశారు. ఇప్పుడిదే నెంబర్ వన్‌ రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో మూడు సార్లు అత్యధిక పరుగులు చేసిన టీమ్.. SRH.. హైఎస్ట్‌ టీమ్‌ స్కోర్.. మనదే.. సింపుల్‌గా ఇది సన్ రైజర్స్ హైదరాబాద్‌ నామ సంవత్సరం.. సో కేకేఆర్‌ అన్ బీటబుల్‌ రికార్డ్‌ను చూసి భయపడలా.. అస్సలు అవసరం లేదు. ఈసారి ఈ రికార్డ్‌ను కూడా తిరగరాసేది మనమే.. డోంట్ వర్రీ..

Also Read: Dipa Karmakar Record : దీపా కర్మాకర్ రికార్డ్.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ జిమ్నాస్ట్

హెడ్‌ మళ్లీ చెలరేగాలి.. క్లాసెన్ క్లాస్ ఆట చూడాలి.. అభిషేక్‌ శర్మ, త్రిపాఠి.. బౌలర్స్‌ను షేక్ చేయాలి.. నితిష్‌ బాల్‌ను చెడుగుడు ఆడుకోవాలి.. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులు వేయాలి. నటరాజ్‌, కమిన్స్‌ ప్రత్యర్థులను కూల్చాలి.. ఇక షాబాజ్, సమద్ తమ ఇంపాక్ట్ చూపించాలి..
So Lets Rise up Guys..and lift the cup.. You guys rise to every challenge.. మర్చిపోకండి.. All the Best..

పద.. పద.. లెట్స్ రైజ్ అప్.. నిప్పై మండే .. సన్‌రైజర్స్.. ఎక్కడో విన్నట్టు ఉందిగా.. యస్.. మరోసారి ఆ Anthem వినేయండి.. సాయంత్రం టీవీలకు అతుక్కుపోండి.

Related News

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Big Stories

×