EPAPER

Shubman Gill: శుభ్ మన్ గిల్.. పరిస్థితేమిటి?

Shubman Gill: శుభ్ మన్ గిల్.. పరిస్థితేమిటి?

Subman gill in Ind vs Zimbabwe Series(Today’s sports news): టీమ్ ఇండియాలో విరాట్ కొహ్లీ ప్లేస్ ని భర్తీ చేసేవాడిలా, భావి కెప్టెన్ గా కీర్తి అందుకుంటున్న శుభ్ మన్ గిల్.. మరి టీ 20 మ్యాచ్ లకి సూట్ అవుతాడా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో ధనాధన్ ఆడి 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. గుజరాత్ రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.


2022 లో 483 పరుగులు చేసి గుజరాత్ టైటిల్ గెలవడంలో తనదే మేజర్ రోల్ అని చెప్పాలి. ఇక 2024 కెప్టెన్ గా 423 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. మరిప్పుడెందుకు ఇలా ఆడుతున్నాడని అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టులకి తీసుకెళ్లి తన ఎటాకింగ్ ఆటతీరుని మార్చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్ని ప్రశ్నలకు  సెలక్టర్లు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం తను బ్యాటింగ్ శైలి వన్డే, టెస్ట్ మ్యాచ్ తరహాలో ఉందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ ల్లో ఒకదాంట్లో 2 పరుగులే చేశాడు. మొదటి వన్డేలో తనొక్కడే 31 పరుగులు చేసినా, మ్యాచ్ ని గెలిపించలేక పోయాడు. తాజాగా జరిగిన మూడో వన్డేలో 49 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఇక్కడ ఫిగర్ బాగానే ఉంది కానీ, మొదట్లో చాలా జిడ్డు బ్యాటింగ్ చేశాడు.


అందువల్ల స్కోరు పెంచే క్రమంలో యశస్వి, అభిషేక్ అవుట్ అయిపోయారనేది ఒక నిజం. వాళ్లు పవర్ ప్లేలో బాగా ఆడతారు. అది వారి బలం. కెప్టెన్ గా బాధ్యతాయుతంగా ఆడాల్సి వచ్చినప్పుడు  ఒక కెప్టెన్ గా త్యాగం చేయాలి. మిగిలినవారికి అవకాశం ఇవ్వాలి. కానీ తను ఓపెనింగ్ ప్లేస్ ని వదిలిపెట్టలేదు. మీ ఏడుపు మీరు ఏడవండి అన్నట్టు ఆడుతున్నాడని అంటున్నారు. ఇప్పుడిక్కడ కెప్టెన్ కాబట్టి, తన ఆటలు సాగుతున్నాయి. రేపు సీనియర్లతో ఆడేటప్పుడు ఆ పప్పులు ఉడకవు కదా అంటున్నారు.

Also Read: జింబాబ్వేతో మరో పోరుకు సిద్ధమైన భారత్.. నేడు నాలుగో టీ20 మ్యాచ్!

నిజానికి ఓపెనింగ్ ప్లేస్ కి కాంపిటేషన్ ఎక్కువగా ఉండటం వల్ల గతంలో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో గిల్ ని ఫస్ట్ డౌన్ పంపించారు, తనెన్ని మ్యాచ్ లు అవుట్ అయినా, అలాగే రోహిత్, ద్రవిడ్ ఆడించారు. ఆ ప్లేస్ అలవాటు చేశారు. దాంతో అతను 3,4,5 టెస్టుల్లో అద్భుతంగా ఆడాడు. మరిప్పుడు జింబాబ్వే టూర్ లో అదే ఫస్ట్ డౌన్ లో వస్తే, ఎంత గౌరవంగా ఉండేది. కుర్రాళ్లకి అవకాశం దొరికేది కదా.. అంటున్నారు.

ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. తను మంచి బ్యాటర్ అయి ఉండి, ఫస్ట్, సెకండ్ డౌన్లలో అద్భుతంగా ఆడగలిగి ఉండి జట్టు కూర్పు కోసం తను త్యాగం చేశాడు. చివర్లో వెళ్లి, ఆ తరహా ఆటకు అలవాటు పడ్డాడు. అందుకే తన కెప్టెన్సీలో అన్ని గొప్ప విజయాలు సాధ్యమయ్యాయని అంటున్నారు. ఇదే గిల్ నేర్చుకుంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×