EPAPER

4 Playoff Teams Strengths: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ లో నాలుగు జట్లు.. ఎవరి బలమెంత..?

4 Playoff Teams Strengths: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ లో నాలుగు జట్లు.. ఎవరి బలమెంత..?

 IPL 2024 Playoff Teams KKR, SRH, RR and RCB Strengths: ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. ఇంక అసలైన సమరం మిగిలింది. సుమారు రెండునెలల పాటు సాగిన టీ 20 మ్యాచ్ ల పోరాటం చివరి దశకు వచ్చింది. ఇక్కడ నుంచి విజేతలు ఎవరనేది వచ్చే ఆదివారం నాటికి తేలిపోనుంది.


ఇకపోతే ప్లే ఆఫ్ కి చేరిన జట్లలో కోల్ కతా నెంబర్ వన్ స్థానంలో ఉంటే, హైదరాబాద్ నెంబర్ 2లో ఉంది, నెంబర్ 3లో రాజస్థాన్, నెంబర్ 4లో బెంగళూరు ఉన్నాయి.

కోల్ కతా నైట్ రైడర్స్

కోల్ కతా విషయంలో మొదట్లో అందరిలా మ్యాచ్ లు ఆడినా, తర్వాత నిలదొక్కుకుంది. వ్యూహాత్మకంగా ఆడుతూ విజయాలు సాధిస్తూ వచ్చింది. ముంబయి, బెంగళూరు, చెన్నయ్, గుజరాత్ తరహాలో ఎగ్స్ ట్రాలు లేకుండా ఆడింది. 20 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది.


Also Read: ధోని 110 మీటర్ల సిక్స్.. చెన్నై కొంప ముంచిందా..?

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రతిభ కన్నా, గౌతంగంభీర్ మెంటర్ గా రావడం వల్లనే ఫలితాలు వచ్చాయని అంతా అంటున్నారు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, అంగ్ క్రిష్ రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్ అందరూ బాగా ఆడారు. టీ 20 ప్రపంచకప్ నకు ఎంపికైన రింకూ సింగ్ తప్ప, అందరూ తమ వంతు పాత్ర పోషించారు

బౌలింగులో వైభవ్ ఆరోరా, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి సమర్థవంతంగా బౌలింగు చేశారు.

హైదరాబాద్ సన్ రైజర్స్

సన్ రైజర్స్ విషయానికి వస్తే, కెప్టెన్ కమిన్స్ వ్యవహార దక్షత ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఇదే టీమ్ గత మూడు, నాలుగు సీజన్ల నుంచి అట్టడుగు స్థానాల్లో ఉంది. అలాంటి టీమ్ ని మళ్లీ సెట్ చేసి, ఇప్పుడు ప్లే ఆఫ్ కి తీసుకువెళ్లాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు.

వారికి నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్ సపోర్ట్ దొరికింది. ఇక బౌలింగులో చూస్తే భువనేశ్వర్ కుమార్ ఫామ్ లోకి రావడంతో హైదరాబాద్ దశ తిరిగింది. తనకి సపోర్టుగా కమిన్స్, నటరాజన్, మార్కో జాన్సన్ బౌలింగు సపోర్టు కూడా దొరికింది. దీంతో కీలకమైన మ్యాచ్ లన్నీ గెలిచారు. 17 పాయింట్లు సాధించారు. వర్షం కారణంగా ప్లే ఆఫ్ లో సెకండ్ ప్లేస్ కి చేరారు.

Also Read: ఆ మేజిక్ రిపీట్ అవుతుందనుకున్నా.. ఆ వికెట్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ : రుతురాజ్

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఒక దశలో టేబుల్ టాపర్ గా ఉన్న రాజస్థాన్ ఎందుకో చివర్లో గాడి తప్పింది. వరుసగా 4 మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో 16 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. పేపర్ మీద చూస్తే అందరూ పులుల్లాగే కనిపిస్తున్నారు. ఇటీవల పిల్లుల్లా మారిపోయారు. యశస్వి జైశ్వాల్ , జోస్ బట్లర్ ఓపెనర్లు పైకి బాగున్నా, ఒకట్రెండు మ్యాచ్ లు తప్ప పెద్దగా ఆకట్టుకోలేదు. సంజూ శాంసన్ ఒక్కడే చాలా మ్యాచ్ లు నిలబెట్టాడు. రియాన్ పరాగ్, రోవ్ మన్ పొవెల్, హెట్ మెయిర్ మొదట్లో బాగా ఆడారు. తర్వాత తేలిపోయారు.

బౌలింగులో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్, అశ్విన్, చాహల్ తో చాలా పటిష్టంగా ఉంది. మరి నాకౌట్ మ్యాచ్ ల్లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

విరాట్ కొహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

కిందపడి పైకి లేచిన జట్టు ఏదన్నా ఉందంటే ఒక్క ఆర్సీబీ అని చెప్పాలి. అయిపోయింది రా, ఆర్సీబీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఎలాగొలా పడుతూ లేస్తూ, వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ కి చేరింది. మరి జట్టులో స్పీడు, స్పిరిట్, ఉత్సాహం, వేడి చూస్తుంటే ఆర్సీబీ ఈసారి కప్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: హార్దిక్ పాండ్యాను అందుకే తీసుకున్నాం: జై షా క్లారిటీ!

విరాట్ కొహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అందరికన్నా ఎక్కువ పరుగులు చేసి ముందడుగు వేస్తున్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ కూడా టచ్ లోకి వచ్చాడు. రజత్ పటేదార్, దినేష్ కార్తీక్ ఇద్దరూ తమ వంతు పరుగులు చేసి వెళ్లిపోతున్నారు. విల్ జాక్స్, మాక్స్ వెల్ అందరూ ఫామ్ లోకి వచ్చారు. బౌలింగులో సిరాజ్ ఫామ్ లోకి రావడంతో ఆర్సీబీ ఊపిరి తీసుకుంది. రీస్ టోప్లే, ఆకాశ్ దీప్, విల్ జాక్స్, మ్యాక్స్ వెల్ అందరూ కట్టుదిట్టంగా బౌలింగు చేస్తున్నారు.

మొత్తానికి నాలుగు జట్లు అన్నిరకాలుగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మరి చివరికి ఫైనల్స్ కి వెళ్లే జట్టు ఏదో, కప్ కొట్టే జట్టేదో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

Tags

Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×