EPAPER

Steve Waugh : టెస్ట్ క్రికెట్ ను ఎవరూ పట్టించుకోరా..? స్టీవ్ వా ఆవేదన..

Steve Waugh : టెస్ట్ క్రికెట్ ను ఎవరూ పట్టించుకోరా..? స్టీవ్ వా ఆవేదన..

Steve Waugh : టీమ్ ఇండియాకి మహేంద్ర సింగ్ ధోనీ కాలమంతా  ఒక స్వర్ణయుగమని ఎలా అంటారో.. ఆస్ట్రేలియాలో కూడా స్టీవ్ వా కెప్టెన్సీ కాలమంతా అలాగే అభివర్ణిస్తారు. కెప్టెన్లలో టాప్ టెన్ లో స్టీవ్ వా ఒకరని కూడా అంటారు. మ్యాచ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాసరే, తను బ్యాటింగ్ కి వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి, జట్టుని సురక్షిత స్థానానికి చేర్చడం స్టీవ్ వా గొప్పతనాల్లో ఒకటని చెప్పాలి.


అలాగే బౌలింగ్ చేసేటప్పుడు కూడా ప్రత్యర్థులను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేయడం, బౌలర్లను పదేపదే మార్చడం, ఫీల్డర్లను మొహరించడం అంతా పక్కా వ్యూహంతో నడిపించి జట్టుని విజయపథంలో నడిపించేవాడు. అలాంటి స్టీవ్ వా చాలాకాలం తర్వాత నోరు విప్పాడు. అది కూడా ఆవేదన భరితంగా మాట్లాడాడు.

టెస్ట్ మ్యాచ్ లను నిర్వీర్యం చేస్తున్నారని, ఇక వాటికి కాలం చెల్లినట్టేనని అన్నాడు. ఐసీసీ దగ్గర నుంచి బీసీసీఐ, ఇంకా ఇతర దేశాల క్రికెట్ బోర్డులే అందుకు నిదర్శనమని అన్నాడు. లీగ్ మ్యాచ్ లు, టీ 20 మ్యాచ్ లు, టీ 10 మ్యాచ్ లు వీటికి, అవి నిర్వహించే ఫ్రాంచైజీలకి ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నాడు. డబ్బుల కోసం సంప్రదాయ క్రికెట్ ను మంటగలుపుతున్నారని ఆక్రోశించాడు. ఈ విషయంలో ఐసీసీకి చెప్పేవారే లేరా? అని ప్రశ్నించాడు.


స్టీవ్ వాకి ఇంత కోపం రావడానికి కారణం ఉంది. సౌతాఫ్రికా త్వరలోనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఆ జట్టులో ప్రధాన ఆటగాళ్లు ఎవరూ అందుబాటులో లేరు. అందువల్ల బీ టీమ్ ని కివీస్ టూర్ కి పంపిస్తున్నారు.

కారణం ఏమిటంటే సౌతాఫ్రికా ప్లేయర్లు మన ఐపీఎల్ తరహా ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకుంటే టెస్ట్ క్రికెట్ ఆడటానికి, అనర్హులుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో  సౌతాఫ్రికాలో పలువురు క్రికెటర్లు వివిధ దేశాల్లో జరిగే లీగ్ లు, ఐపీఎల్ వీటన్నింటితో ఒప్పందాల్లో మునిగి ఉన్నారు. దీంతో వాళ్లెవరూ న్యూజిలాండ్ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ముందుగానే జరిగిన ఒప్పందం మేరకు సౌతాఫ్రికా నుంచి బీ టీమ్ ని అక్కడికి పంపిస్తున్నారు.

ఇదే మాట స్టీవ్ వా చెబుతూ.. “నేనే గానీ న్యూజిలాండ్ లో ఉండి ఉంటే, ఇలా బీ టీమ్ తో క్రికెట్ ఆడను ” అని అన్నాడు. ఇది రెండు దేశాలకి నష్టమేనని తెలిపాడు. ఇప్పటికే టెస్ట్ మ్యాచ్ లకి అంతంత మాత్రం ఆదరణ ఉంటే, ఇలాంటి బీ టీమ్ లు వెళితే, వచ్చే ఆ నలుగురు అభిమానులు కూడా రారని తేల్చి చెప్పాడు. అంతేకాదు వీరిలా చేస్తే, ఇతర దేశాలు కూడా  ఇదే పంథా అవలంబిస్తే, రాబోయే రోజుల్లో ఇక టెస్ట్ మ్యాచ్ లు కనిపించవని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరో నిజం కూడా చెప్పాడు. వన్డేలు, టీ 20లకి ఇచ్చే రెమ్యునరేషన్ తో పోల్చితే టెస్ట్ మ్యాచ్ ఆడే ఆటగాళ్ల ఫీజు తక్కువని, ఈ విషయంపై కూడా ఎవరూ నోరు మెదపరని నెత్తి కొట్టుకున్నాడు. మరి ఒకప్పటి దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారో చూడాలి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×