EPAPER

Manu Bhaker: ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పతకధారి మను బాకర్

Manu Bhaker: ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పతకధారి మను బాకర్

Manu Bhaker set to be India’s flagbearer in Paris Olympics 2024 closing ceremony:పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి, తృటిలో మూడోపతకం చేజారిపోయిన మనుబాకర్ కి అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతకధారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. చిన్న పాయింట్ తేడాతో పతకం చేజారిపోయింది. అయితే తను ప్రాక్టీస్ అంతా 10 మీ. పిస్టల్  వ్యక్తిగత, మిక్స్ డ్ డబుల్ విభాగాల్లో తను కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.


అయితే పురుష పతకధారి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఆగస్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇకపోతే మను బాకర్ మాట్లాడుతూ నా చివరి మ్యాచ్ లు పూర్తి కాగానే కోచ్ జస్పాల్ నా వద్దకు వచ్చి.. ‘చరిత్ర.. చరిత్రే’ ఇక వర్తమానంలో ఉండాలి. జరిగిన దాని గురించి తర్వాత ఖాళీ ఉన్నప్పుడు తీరికగా ఆలోచించవచ్చునని అన్నాడు.

అవే మాటలు నాలో స్ఫూర్తిని నింపాయని మనుబాకర్ తెలిపింది. మూడో పతకం తేవాలనే ఒత్తిడి నాపై లేదు. అయితే ఉత్తమ ప్రదర్శన చేయాలని మాత్రమే భావించాను. నిజానికి నాలుగో స్థానం…అంత సంతోషాన్నిచ్చేది కాదని అంది. కానీ ఇదొక స్ఫూర్తి. మ్యాచ్ మొదట్లో ఇంతదూరం వస్తానని అనుకోలేదు. కానీ భవిష్యత్తులో మరింత గొప్ప ప్రదర్శన చేయడనికి ప్రయత్నిస్తానని తెలిపింది.


Also Read: భారత్ వర్సెస్ శ్రీలంక..రెండో వన్డేలో కీలకమార్పు!

25 మీటర్ల ఫైనల్ రౌండులో నా  స్టార్టింగ్ బాగాలేదు. తర్వాత పుంజుకున్నాను. ఆ బిగినింగ్ పికప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. కానీ ఇంతదూరం రావడం గొప్ప విషయమేనని తెలిపింది. అలాగే ఒలింపిక్స్ ముగింపు రోజున పతకధారిగా నిలవడం నా అద్రష్టమని తెలిపింది.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×