EPAPER

SL vs BAN : చెలరేగిన షకీబ్.. శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘనవిజయం..

SL vs BAN : చెలరేగిన షకీబ్.. శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘనవిజయం..

SL vs BAN : బంగ్లాదేశ్ గెలిచింది.. కానీ సెమీస్ రేస్ నుంచి తప్పుకుని  ఇంటి దారి పట్టింది. శ్రీలంకని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.  ఇద్దరి మధ్యా హోరాహోరీగా కాకపోయినా ఒక హైడ్రామా మధ్య మ్యాచ్ ముగిసింది.


టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన శ్రీలంక ఓపెనర్లలో కుశాల్ పెరీరా (4) మొదటి ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇంక శ్రీలంక జట్టు మారదని ఫిక్స్ అయ్యారు. ఈ దశలో మరో ఓపెనర్ నిస్సాంక (41) కాసేపు పోరాడాడు. తర్వాత కెప్టెన్ కుశాల్ మెండిస్ (19) పరుగులు చేసి వెనుతిరిగాడు. తను అవుట్ అయ్యే సమయానికి 12.4 ఓవర్లు గడిచాయి. 3 వికెట్ల నష్టానికి 72 పరుగులతో శ్రీలంక విలవిల్లాడుతోంది.

ఈదశలో సెకండ్ డౌన్ వచ్చిన సదీర సమరవిక్రమ (41) కాసేపు నిలబడ్డాడు. సెంచరీ చేసిన చరిత్ అసలంక (108) కు మద్దతుగా నిలిచి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో ఒక ఎండ్ లో అసలంక ఉన్నాడు. మరోవైపు ఎవరూ తనకి సరైన సపోర్ట్ ఇవ్వలేదు. ఒక విలువైన భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దాంతో తనది ఒంటరిపోరాటం అయిపోయింది.


ఈ సమయంలో వచ్చిన ఆల్ రౌండర్ ఎంజిలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ తీవ్ర చర్చకు తెరతీసింది. తను హెల్మెట్ మార్చుకోవడం ఆలస్యం కావడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ ఆలీ హాసన్ అంపెర్లకు అప్పీల్ చేశాడు. దీంతో వారు నిర్ణయం తీసుకుని రూల్ ప్రకారం అవుట్ అని చెప్పారు. దీంతో మాథ్యూస్ నిరాశగా వెనుతిరిగాడు. ఆ తర్వాత ధనంజయ డిసిల్వా (34), మహేశ్ తీక్షణ (22), దుష్మంత చమీర (4) ఇలా చేయడంతో 49.3 ఓవర్లలో 279 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో హసన్ శకీబ్ 3, షకీబ్ ఆల్ హసన్ 2, ఇస్లాం 2, మెహదీ హసన్ 1 వికెట్ తీసుకున్నారు.

ఛేజింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు తడబడుతూనే ఆడారు. తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) చేసి అవుట్ అయ్యారు. 6.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 41 పరుగులు చేసింది. ఆ దశంలో ఫస్ట్ డౌన్ వచ్చిన నజ్ముల్ హుస్సేన్ షాంతో (90), సెకండ్ డౌన్ వచ్చిన కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ (82) బంగ్లాని ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు.

ఒక దశలో వీరిద్దరే మ్యాచ్ ని గెలిపిస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వికెట్లు పడిపోయాయి. ఇద్దరూ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయిపోయారు. అయితే కెప్టెన్ షకీబ్ ఎవరినైతే టైమ్డ్ అవుట్ చేశాడో…ఆ మాథ్యూ బౌలింగ్ లోనే అవుట్ అయిపోయాడు. అప్పుడు షకీబ్ వెళుతుంటే బౌలర్ మాథ్యూస్ వాచ్ చూపిస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

నువ్వు టైమ్డ్ అవుట్ చేశావు కదా…ఇప్పుడు నా టైమ్ వచ్చింది అంటూ వాచీ చూపించాడు.
అయితే బంగ్లా స్కోరు 210 దగ్గర హోసన్ షాంతో అవుట్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి 255 పరుగులు దగ్గరికి వచ్చేసరికి బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. మళ్లీ మ్యాచ్ టెన్షన్ లో పడింది. కానీ  మహ్మదుల్లా (22), ముష్ఫీకర్ రహీమ్ (10), తోహిద్ హ్రిదోయ్ (15) ముందు నిలబడి బంగ్లాని గెలిపించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 3, మహేష్ తీక్షణ 2, ఏంజిలో మాథ్యూస్ 2 వికెట్లు తీసుకున్నారు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×