EPAPER

SRH Vs RR Qualifier 2 Preview: ఫైనల్ కి దూసుకెళ్లేదెవరు..? నేడే రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్

SRH Vs RR Qualifier 2 Preview: ఫైనల్ కి దూసుకెళ్లేదెవరు..? నేడే రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్

Sunrisers Hyderabad Vs Rajasthan Royals Qualifier 2 Preview: ఐపీఎల్ 2024లో ఒక పోరాటం ముగిసింది. రెండు మ్యాచ్ లకు దూరంలో ఐపీఎల్ ట్రోఫీ ఊరిస్తోంది. మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఈ రోజు శుక్రవారం మే 24న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇందులో హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ పోటీ పడనున్నాయి. చెన్నయ్ లోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30కి ప్రారంభం కానుంది. ఇందులో ఫైనల్ ఎవరు ఆడుతారనేది తేలిపోనుంది.


హైదరాబాద్ కి వర్షం వచ్చి రెండు రకాలుగా అదృష్టం కలిసి వచ్చింది. 14 పాయింట్ల మీద ఉండగా మ్యాచ్ ఆడకుండా వర్షం వచ్చి రద్దయిపోయింది. దాంతో ఒక పాయింట్ వచ్చి 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కి చేరింది. తర్వాత ప్లే ఆఫ్ లో 17 పాయింట్లతో ఉండగా, కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. దాంతో రాజస్థాన్ 17 పాయింట్ల వద్ద ఆగిపోయింది. అలా ప్రత్యర్థుల మ్యాచ్ లో పడిన వర్షం కూడా హైదరాబాద్ కి కలిసివచ్చింది. నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ ని దాటి ఒకేసారి టాప్ 2లోకి వెళ్లిపోయింది.

ఇప్పుడక్కడ క్వాలిఫైయర్ 1లో కోల్ కతా తో ఓడిపోయింది. మరో అదృష్టం కలిసి వచ్చింది.  రేపు రాజస్థాన్ తో పోటీ పడనుంది. అంటే హైదరాబాద్ కి ఎన్ని అదృష్టాలు కలిసి వస్తున్నాయో చూడండి. ఇలాగే ముందుకెళితే ట్రోఫీ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంటున్నారు.


Also Read: కోచ్ కోసం బీసీసీఐ వేట, రిజెక్ట్ చేసిన రికీపాటింగ్!

హైదరాబాద్ విషయానికి వస్తే.. ఒక మ్యాచ్ సరిగా ఆడకపోతే, ఒక మ్యాచ్ బ్రహ్మండంగా ఆడుతున్నారు. బహుశా లెక్క ప్రకారం మొన్న సరిగా ఆడలేదు కాబట్టి, రేపు విజృంభిస్తే రాజస్థాన్ తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడి, మళ్లీ  ఇప్పుడు ఆర్సీబీపై గెలిచి లైనులో పడ్డారు. బౌలింగు పటిష్టంగా ఉంది.  ట్రెంట్ బౌల్ట్ ఓపెనింగ్ స్పెల్ అద్భుతంగా ఉంది. ఇక అశ్విన్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు.

తర్వాత సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్ వికెట్లు తీస్తున్నారు. ఇది కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే యశస్వి ఫామ్ లోకి వచ్చాడు. ఇది ప్రత్యర్థులకి ప్రమాదకరమే అని చెప్పాలి. తను క్రీజులో కుదురుకున్నాడంటే, ఒకపట్టాన వదిలిపెట్టడు.

టామ్ కొహ్లెర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్ మేయర్, పావెల్ అందరూ హిట్టర్లే కనిపిస్తున్నారు. అందువల్ల హైదరాబాద్ టాప్ ఆర్డర్ మూడు వికెట్లు తీస్తే, మ్యాచ్ గెలిచినట్టేనని సీనియర్లు అంటున్నారు. మరి ఇదే ఊపులో హైదరాబాద్ ని చితక్కొట్టి ఫైనల్ కి వెళతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×