EPAPER

SRH Vs RR Qualifier 2 Match Highlights: హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. మ్యాచ్ సాగిందిలా..!

SRH Vs RR Qualifier 2 Match Highlights: హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. మ్యాచ్ సాగిందిలా..!

SRH Vs RR Qualifier 2 IPL 2024 Highlights: ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.. ఐపీఎల్ ప్రారంభం నుంచి బ్రహ్మాండంగా ఆడుతూ టాప్ వన్, టూ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్.. క్వాలిఫైయర్ 2  మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైంది. చివరికి ఆఖరి మెట్టు ముందు టోర్నీ నుంచి వైదొలగింది. ఇక హైదరాబాద్  స్పిన్నర్లను అభినందించాలి. ‘లో-స్కోరు’గేమ్ ను కూడా కాపాడి ఫైనల్ కి తీసుకువెళ్లారు. ఇక ఆదివారం నాడు చెన్నయ్ చెపాక్ స్టేడియంలో కోల్ కతా జట్టుతో హైదరాబాద్ తలపడనుంది.


టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగు తీసుకుంది. దీంతో హైదరాబాద్ మొదట బ్యాటింగుకి వచ్చింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 36 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.

వివరాల్లోకి వెళితే.. 176 పరుగుల టార్గెట్ తో రాజస్థాన్ బ్యాటింగు ప్రారంభించింది. అయితే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆత్మ విశ్వాసంతోనే ఆడాడు. కానీ మరో ఓపెనర్ టామ్ కొహ్లెర్ చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా గ్రౌండులో గాలి లేకపోవడంతో ఆటగాళ్లు చెమటలు కక్కారు. ఇక విదేశీ ప్లేయర్లు అయితే, వారి పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. ఈ క్రమంలోనే టామ్ కొహ్లెర్ (10) త్వరగా అవుట్ అయిపోయాడు.


Also Read: స్పిన్నర్లు తిప్పేశారు.. హైదరాబాద్ ను గెలిపించారు

ఆ తర్వాత యశస్వి మంచి రిథమ్ లోకి వచ్చాడు. భువనేశ్వర్ కుమార్ 3 వ ఓవర్ లో 19 పరుగులు చేసి, అందరినీ టెన్షన్ పెట్టాడు. 4 ఓవర్ల వరకు 1 వికెట్ నష్టానికి 24 పరుగులతో పడుతూ లేస్తున్న జట్టుని యశస్వి మళ్లీ పట్టాలెక్కించాడు. తను అవుట్ అయ్యే సమయానికి 2 వికెట్ల నష్టానికి రాజస్థాన్ 65 పరుగులతో పవర్ ఫుల్ గా ఉంది.

మొత్తానికి యశస్వి 21 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్ ఆదుకుంటాడనుకుంటే, 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. దీంతో ఒక్కసారి మ్యాచ్ హైదరాబాద్ కంట్రోల్ లోకి వచ్చింది. అంతే వారు ఎక్కడా పట్టు సడలనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు.  చాలా బౌండరీలు ఆపారు. అన్నిటికి మించి ఎక్కడా వదిలేయకుండా క్యాచ్ లు పట్టుకున్నారు.

Also Read: SRH vs RR Qualifier-2 Highlights: క్వాలిఫైయర్-2లో సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ.. ఫైనల్‌కి SRH

ఇకపోతే రియాన్ పరాగ్ (6), అశ్విన్ (0), హెట్ మెయిర్ (4), రోవ్ మన్ పావెల్ (6) ఇలా మంచి హిట్టర్లు అందరూ చేతులెత్తేశారు. మరో ఎండ్ లో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. తనకి సరిగ్గా మద్దతిచ్చే వారే కరవయ్యారు. తనకి సమానంగా మరో పార్టనర్ షిప్ బిల్డ్ అయి ఉంటే బాగుండేది. అది జరగలేదు. ఈ క్రమంలో 35 బంతుల్లో 2 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ధృవ్ నాటౌట్ గా నిలిచాడు.

చివరికి రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. దీంతో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హైదరాబాద్ బౌలింగులో షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ 2, కమిన్స్ 1, నటరాజన్ 1 వికెట్ పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతోనే ప్రారంభించారు. కాకపోతే తొందరపాటు, ప్రతి బాల్ ని కొట్టేయాలన్న తపన ఎక్కువై త్వరత్వరగా అవుట్ అయిపోయారు.

Also Read: ఇవే మా ఓటమికి కారణాలు: సంజూ శాంసన్

అలా అభిషేక్ శర్మ (12) మొదట మొదలెట్టాడు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొంచెం కథని ముందుకు నడిపారు. ముఖ్యంగా త్రిపాఠి 15 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. అలాగే ట్రావిస్ హెడ్ అయితే 28 బంతుల్లో 1 సిక్సర్, 3 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. తర్వాత మార్క్రమ్ (1) చేసి అవుట్ అయిపోయాడు.

ఇక చివరి వరకు నిలిచింది వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పాలి. అలా చివరి వరకు నిలబడిపోయాడు. 34 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (5), అబ్దుల్ సమద్ (0), షహబాజ్ అహ్మద్ (18) ఇలా వచ్చి అలా అయిపోయారు. ఇక కమిన్స్ (5), జయదేవ్ ఉనద్కత్ (5) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

బౌలింగులో ట్రెంట్ బౌల్ట్ 3, సందేప్ శర్మ 2, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. మొత్తానికి క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఏదో ఉత్కంఠభరితంగా ఉుంటుదని అనుకుంటే సాదాసీదాగా నడిచిపోయింది.

Related News

Ollie Pope Creates History: ఏడు దేశాలపై ఏడు సెంచరీలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డ్

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Big Stories

×