EPAPER

Big shock to Srilanka: శ్రీలంకకు షాక్, గాయంతో వైదొలిగిన బౌలర్ దుష్మంత

Big shock to Srilanka: శ్రీలంకకు షాక్, గాయంతో వైదొలిగిన బౌలర్ దుష్మంత

Big shock to Srilanka: రెండురోజుల్లో టీమిండియా-శ్రీలంక మధ్య క్రికెట్ మ్యాచ్‌లు మొదలు కానున్నా యి. అంతలోనే లంకేయులకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర జట్టుకు దూరమయ్యాడు. భారత్‌తో సిరీస్‌కు అందుబాటులోకి ఉంచపోవచ్చని ఆ జట్టు చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ చెప్పుకొచ్చాడు.


శనివారం నుంచి భారత్-శ్రీలంకల మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. సిరీస్‌కు లంకేయులకు ఊహించ ని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ దుష్మంత చమీర ఈ సిరీస్‌కు దూరయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక జట్టు చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ వెల్లడించాడు. ఈ విషయం మా దృష్టికి వచ్చిందని, మరో ఆటగాడ్ని తీసుకుంటామనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు.

32‌ ఏళ్ల దుష్మంత చమీర.. 2015లో లంక జట్టులోకి అడుగుపెట్టాడు. ఆ జట్టులోని కీలక బౌలర్‌గా
మారాడు. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో చమీర గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. ఈ క్రమంలో భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు చమీర దూరం కానున్నాడు.


ALSO READ: ఆరోజు షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు: ఫ్రెండ్ చెప్పిన మాట

ప్రస్తుతం టీమిండియాకు కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌కు ఇది తొలి విదేశీ పర్యటన. అటు ప్రస్తుత కోచ్ సనత్ జయసూర్య తొలిసారి ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందనే చర్చ సాగుతోంది. శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా అసలంక ఎంపికయ్యాడు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను హసరంగ నిర్వహించేవాడు. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్‌లో ఆ జట్టు పేలవమైన ఆటతీరుతో కనీసం సూపర్-8కు చేరుకోలేదు. దీంతో కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు.

టీమిండియాతో జరిగే టీ20 సిరీస్ జట్టును ప్రకటించింది లంక జట్టు. అసలంక కెప్టెన్ కాగా, పాతుమ్ నిస్సాంక, కుల్‌జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండీస్, దాసున్ షనక, వయందు హసరంగా, దునిత్ వెల్లాలగే, తీక్షణ్, చమిందు విక్రమ్, మఠిశ్రమ పాసింగ్హే, బినూర్ ఫెర్నాండో.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×