EPAPER

SL vs Ind 2nd ODI: టీమ్ ఇండియాను వణికించిన.. శ్రీలంక వెటరన్ బౌలర్

SL vs Ind 2nd ODI: టీమ్ ఇండియాను వణికించిన.. శ్రీలంక వెటరన్ బౌలర్

Jeffrey Vandersay 6-33 spins Sri Lanka to big victory over India: శ్రీలంక వెటరన్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే ధాటికి టీమ్ ఇండియా టాపార్డర్ విలవిల్లాడింది. కొహ్లీ, రాహుల్, దూబె, శ్రేయాస్, అందరూ తెల్లమొఖాలేశారు. బాగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ కూడా తనకే వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తానికి ఇండియా పతనాన్ని ఒక్కడు శాసించాడు.


ఇక్కడ చిత్రం ఏమిటంటే, తనేమీ రెగ్యులర్ స్పిన్నర్ కాదు.. 34 ఏళ్ల వాండర్సే ఇప్పటివరకు ఆడిన వన్డేలు కేవలం 22, ఇక టీ 20ల విషయానికి వస్తే 14 మాత్రమే ఆడాడు. ఒకటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఒక వన్డేల్లో తను ఇప్పటివరకు 27 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఇక్కడ రెండో వన్డేలో మాత్రం 6 వికెట్లు తీసి, టీమ్ ఇండియా టాపార్డర్ ను కుప్పకూల్చాడు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, శ్రీలంక జట్టులో స్థానమే లేని వాండర్సేకి ఎలా మనవాళ్లు దొరికిపోయారా? అనే అనుమానాలు నెట్టింట  వ్యక్తమవుతున్నాయి. ఒక సాధారణ బౌలరుగా జట్టులో స్థానమే కోల్పోయిన వాండర్సేకి, ఎలా వికెట్లు సమర్పించుకున్నారు? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.


నెట్టింట క్రికెట్ పండితులు జుట్టు పీక్కుంటున్నారు. అదీకాక తనొక వెటరన్ బౌలర్ గా ఉన్నాడు. నేడో రేపో రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నాడు. అలాంటి బౌలర్ కి వికెట్లు ఇచ్చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి.
Also Read: పారిస్ ఒలింపిక్స్, జకోవిచ్ బంగారం.. ఆపై కంటతడి..

అదీకాక వాండర్సేకి జట్టులో స్థానమే లేదు. ఆల్ రౌండర్ హసరంగకి గాయం కావడంతో అతని ప్లేస్ లో విధిలేని పరిస్థితుల్లో తనకి అవకాశం ఇచ్చారు. దాంతో   ఓవర్ నైట్ లో వాండర్సే స్టార్ అయిపోయాడు. ఆ అవకాశాన్ని టీమ్ ఇండియా ఇచ్చింది.

ఇకపోతే పిచ్ బాగాలేకపోతే ఆడలేరా? స్పిన్ తిరిగితే ఆడలేరా? వికెట్లపైకి వస్తే కాసుకోలేరా? అంటూ నెటిజన్లు.ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. మొత్తానికి గౌతం గంభీర్ కి సీనియర్లందరూ కలిసి తొలి ఝలక్ ఇచ్చారు. దీంతో మనోడికి వళ్లు మండి ఎంత మందిని ఉంచుతాడో, ఎంతమందిని పీకేస్తాడో తెలీదని కామెంట్ చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×