EPAPER

Shubman Gill Health Update: టీమిండియా స్టార్ ఓపెనర్ హెల్త్ అప్ డేట్.. బీసీసీఐ కీలక ప్రకటన..

Shubman Gill Health Update: టీమిండియా స్టార్ ఓపెనర్ హెల్త్ అప్ డేట్.. బీసీసీఐ కీలక ప్రకటన..
Shubman Gill Health Update

Shubman Gill Health Update: డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న కారణంగా భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మ‌న్ గిల్ …ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత్ ప్రారంభ మ్యాచ్ లో ఆడ లేకపోయాడు. కానీ ఆతని ప్లేస్ లో వచ్చిన ఇషాన్ కిషన్ లక్కీగా దొరికిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ డకౌట్ అయ్యి అభిమానులను నిరాశపరచాడు. దీంతో కనీసం సెకండ్ మ్యాచ్ కి అయినా ..సరే గిల్ తిరిగి ఫామ్ లోకి రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న అభిమానులకు బీసీసీఐ సరికొత్త షాకింగ్ వార్త వెల్లడించింది.


అక్టోబర్ 11న ఢిల్లీలో జరగనున్న ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కి కూడా గిల్ దూరం కాబోతున్నాడు. డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడంతో గిల్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ లో పాల్గొనలేకపోయాడు. దూకుడుగా ఆడే ఈ ఓపెనింగ్ బ్యాటర్ లేని లోటు మొన్న మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. బరిలోకి దిగిన ఓపెనర్స్ వరుసగా డక్ అవుట్ అవుతుంటే…గిల్ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అని అనుకోని వారు ఉండరు.

అయితే ప్రస్తుతం గిల్ ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించిన బీసీసీఐ…టీం ఇండియా జట్టుతో కలిసి ఢిల్లీలో జరగనున్న మ్యాచ్ లో పాల్గొనడం కోసం గిల్ వెళ్లడం లేదు అని స్పష్ఠీకరించింది. ప్రస్తుతం అతని ఆరోగ్య రీత్యా…చెన్నైలోనే వైద్య బృందం పర్యవేక్షణలో ఉండబోతున్నట్లు తెలియపరిచింది. అంతేకాకుండా టోర్నమెంట్ లో పాల్గొనాలి అంటే మానసికంగా, శారీరకంగా 100% దృఢంగా ఉండాలి…ప్రస్తుతం గిల్ అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి.. మ్యాచ్ లో పాల్గొనలేదు అని తెలియపరచింది. దీంతో సెకండ్ మ్యాచ్ లో గిల్ పర్ఫామెన్స్ చూడొచ్చు అని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది.


అయితే ప్రస్తుతం గిల్ గైర్హాజరీలో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనున్న భారత్ జట్టు తరఫున ఓపెనర్ గా కెప్టెన్ రోహిత్ తో కలిసి ఎడమ చేతివాటం బ్యాటర్ ఇషాన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే తొలి మ్యాచ్ లో కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేక గోల్డెన్ డక్ గా మిగిలిన ఇషాన్.. రేపు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్యూస్షన్ గా మారింది. అయితే ఇషాన్ మాత్రం ఈసారి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో తన ప్రతాపం చూపించి కాస్తయినా తన ఇమేజ్ కు జరిగిన డామేజ్ కంట్రోల్ చేసుకోవాలి అని గట్టి పట్టుదల మీద ఉన్నాడు.

మరోపక్క మొన్న మ్యాచ్ తర్వాత భారత్ టాప్ ఆర్డర్ తడబడుతోంది అంటూ పలు రకాల మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కోహ్లీ ఆదుకున్నాడు …రాహుల్ నిలబడి ఆడాడు.. బుమ్రా భలేగా పెర్ఫార్మ్ చేశాడు…ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ ప్రతి మ్యాచ్ లో ఇది జరగాలి అన్న గ్యారంటీ లేదు కదా. మ్యాచ్ భారాన్నంతా ఒకళ్ళిద్దరి పై వేసి మిగిలిన వాళ్ళు రిలాక్స్డ్ గా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ఆన్లైన్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నమోదైన అత్యంత స్వల్ప స్కోర్ దాటడానికి కూడా భారత్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు తడబడడం రాబోయే మ్యాచ్లలో వాళ్ళ పర్ఫామెన్స్ పై అనుమానం రేకెత్తిస్తోంది.

ఢిల్లీలో జరగబోయే మ్యాచ్ లో భారత్ బాటర్స్ తిరిగి తమ మ్యాజిక్ చూపించాలి అని అందరూ ఆశిస్తున్నారు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×