EPAPER

Shubman Gill: అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్

Shubman Gill: అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్

Shubman Gill Comments ( Today’s sports News) : భారత క్రికెట్ లో అనూహ్యంగా జింబాబ్వే టూర్ కి కెప్టెన్ గా వెళ్లిన శుభ్ మన్ గిల్ భావి భారత క్రికెట్ కెప్టెన్ గా తన పేరు సుస్థిరం చేసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే జింబాబ్వే పర్యటనలో యువజట్టుతో వెళ్లి వారిని 4-1 తేడాతో ఓడించి సగర్వంగా ఇండియా తిరిగి వస్తున్నాడు.


ఆఖరి వన్డేలో 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీసుకున్నాడు. సంజూ శాంసన్ ఒంటరిగా పోరాడి 58 పరుగులు చేసి టీమ్ ఇండియాకు గౌరవ ప్రదమైన స్కోరు తీసుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతూ జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ క్రికెటర్లు చాలామందికి విదేశాల్లో ఆడిన అనుభవం లేదు. అయినా సరే, అద్భుతంగా ఆడారని అన్నాడు. మొదటి మ్యాచ్ ఓటమి అనంతరం దెబ్బతిన్న పులుల్లా చెలరేగారని, మనవారి ప్రదర్శన చూసి చాలా సంతోషంగా ఉందని అన్నాడు. వారి ప్రతిభను ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. అందరూ కూడా వారి స్థాయికి మించి ఆడినట్టు తెలిపాడు. ఒక దశలో జట్టు కూర్పు చాలా కఠినంగా మారిందని తెలిపాడు. ఓపెనర్స్ తో జట్టు నిండిపోయిందని తెలిపాడు. అయినా సరే, మన కుర్రాళ్లు ఏ డౌన్ లోనైనా వెళ్లి చక్కగా ఆడి, మ్యాచ్ లను గెలిపించారని తెలిపాడు.


Also Read: కోపా అమెరికా కప్ విజేత అర్జెంటీనా.. 16 సార్లు టైటిల్ గెలిచిన రికార్డ్ సొంతం!

చివరి మ్యాచ్ లో సంజూ శాంసన్, ముఖేష్ కుమార్ రాణించారని తెలిపాడు. వారి వల్లనే విజయం దక్కిందని తెలిపాడు. సంజూ లాంటి సీనియర్ల అనుభవం ఇలాంటి సమయంలో అక్కరకు వస్తుందని తెలిపాడు. ఇక రాబోయే శ్రీలంక పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. ఇంతకుముందు ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్లిన అనుభవం ఉందని తెలిపాడు. అయితే జులై 28 నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమ్ ఇండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ 20లు ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ గైర్హాజరీలో గిల్ ఓపెనర్ ప్లేస్ కి ఢోకా లేదని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×