EPAPER

 Ajit Agarkar-Shreyas Iyer: అగార్కర్ కోపగించుకున్నాడా..? అందుకు శ్రేయాస్ బలయ్యాడా..?

 Ajit Agarkar-Shreyas Iyer: అగార్కర్ కోపగించుకున్నాడా..? అందుకు శ్రేయాస్ బలయ్యాడా..?

 


Shreyas Iyer

Ajit Agarkar Was Furious At Shreyas Iyer: భారత దేశ క్రికెట్ లో నిత్యం వేడెక్కిపోతున్న వార్తల్లో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరే ఉంటున్నారు. బీసీసీఐ కాంట్రాక్టు నుంచి తొలగించిన దగ్గర నుంచి ఇదిగో తోక అంటే, అదిగో పులి అనే చందంగానే వార్తలు నెట్టింట షికార్లు కొడుతున్నాయి.


అయ్యర్ బీసీసీఐ కాంట్రాక్టులో బీ గ్రేడ్ లో ఉంటే, ఇషాన్ కిషన్ సి గ్రేడ్ లో ఉన్నాడు. నిజానికి శ్రేయాస్ రెగ్యులర్ టీమ్ లోనే ఉన్నాడు. తనకి చాలా అవకాశాలిస్తున్నారు. తనని తీర్చిదిద్దాలని టీమ్ మేనేజ్మెంట్ ఒక పనిగా పెట్టుకుంది. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్ లో 500 ప్లస్ రన్స్ చేసిన అయ్యర్ విషయంలో బీసీసీఐ చేసింది కరెక్ట్ కాదని అంటున్నారు.

ఎందుకు శ్రేయాస్ మీద యాక్షన్ తీసుకోవడానికి కారణం అంటే, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ఎందుకంటే తనకి అయ్యర్ మీద కోపం వచ్చిందని సమాచారం. రంజీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో ముంబై తరఫున ఆడాలని బీసీసీఐ కోరగా ఫిట్‌నెస్‌తో లేనని మనవాడు ఖరాఖండీగా చెప్పాడంట.

బీసీసీఐ మాట పెడచెవిన పెట్టి ఐపీఎల్ లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి అయ్యర్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఇది చూసిన బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కి వళ్లు మండింది.

Also Read: Pat Cummins : సన్‌రైజర్స్ కు కొత్త కెప్టెన్ .. కమిన్స్ కు బాధ్యతలు..

భారతదేశం తరఫున క్రికెట్ ఆడటమంటే ఎంత గొప్ప విషయం, అక్కడిలా అవకాశాలు ఇస్తూ, రెడ్ బాల్ క్రికెట్ నేర్చుకోమని చెబితే, వదిలేసి ఇక్కడ ఐపీఎల్ ప్రాక్టీస్ చేస్తున్నాడని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గాయాన్ని కారణంగా చూపించి రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్‌ కాంట్రాక్టుని బీసీసీఐ రద్దు చేసి పారేసింది. అందుకనే ఏ విషయాన్నయినా తెగే వరకు లాగకూడదు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×