EPAPER

Rohit sharma on 1st ODI Match: ఆ ఒక్క పరుగు చేస్తే బాగుండేది: రోహిత్ శర్మ

Rohit sharma on 1st ODI Match: ఆ ఒక్క పరుగు చేస్తే బాగుండేది: రోహిత్ శర్మ

Rohit Sharma Unhappy with Team’s Performance after Ind vs SL 1st ODI Match: టీమ్ ఇండియా గెలవడానికి ఒక్క పరుగే కావాలి. ఇంకా 14 బంతులున్నాయి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఆ ఒక్క పరుగు చేస్తే బాగుండేదని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలవలేకపోవడం బాధగా ఉందని అన్నాడు.


10 ఓవర్ల తర్వాత స్పిన్నర్లు వస్తారని ఊహించే, మొదటి నుంచి ఎదురుదాడి చేశామని అన్నాడు. మంచి ఆరంభం కూడా దొరికిందని అన్నాడు. కానీ మిడిల్ ఆర్డర్ కొంచెం జాగ్రత్తగా ఆడి ఉంటే బాగుండేదని అన్నాడు. అయితే మూమెంట్ బాగానే వచ్చిందని అన్నాడు. కానీ దానిని చివరి వరకు కొనసాగించలేకపోయామని అన్నాడు. అక్షర్, రాహుల్ భాగస్వామ్యంతో మళ్లీ ట్రాక్ ఎక్కింది. అప్పుడు మ్యాచ్ గెలుస్తామని అనుకున్నామని అన్నాడు. అయితే ఒకొక్కసారి మ్యాచ్ లో అలా జరుగుతుంటుంది.

కాకపోతే ఓడిపోకుండా, నిలువరించగలిగామని అన్నాడు. అయితే బాధ ఉంటుందని తెలిపాడు. ఎందుకంటే గెలిచే మ్యాచ్ ఓడిపోయామని అన్నాడు. అయితే ఇది పెద్ద స్కోరేమీ కాదని అన్నాడు.  శ్రీలంక బాగా ఆడింది. ఆఖరివరకు మేం పోరాడిన తీరు గర్వంగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లు మధ్య దోబుచూలాడింది. ఆ ఒక్క పరుగు చేయాల్సింది” అని రోహిత్ పేర్కొన్నాడు.


Also Read: అర్షదీపు.. ఎంత పని చేశావ్? : చెమటోడ్చిన భారత్.. శ్రీలంకతో మ్యాచ్ టై

అయితే మొదట శ్రీలంకను 200 లోపు ఆలౌట్ చేయాల్సిన టీమ్ ఇండియా పట్టు వదిలేసింది. దాంతో వాళ్లు 30 పరుగులు అదనంగా చేశారు. అదే భారత్ కొంప ముంచిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే చివర్లో రెండు జట్లు సమాన స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో అందరూ సూపర్ ఓవర్ కి వెళుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ఐసీసీ, ఇంటర్నేషనల్  టోర్నమెంట్లు, మూడు జట్లు ఆడే ట్రయాంగలర్ సిరీస్, అలాగే టీ 20 సిరీస్ వీటిల్లో మాత్రమే ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ ఉంటుంది. మామూలుగా రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగితే సూపర్ ఓవర్ ఉండదని ఐసీసీ నిబంధనల్లో ఉన్నాయని సీనియర్లు చెబుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×