EPAPER

Sana Javed Reaction Viral: PPL లో ‘సానియా మీర్జా’ నినాదాలు.. సనా జావేద్ రియాక్ష్‌న్ వైరల్!

Sana Javed Reaction Viral: PPL లో ‘సానియా మీర్జా’ నినాదాలు.. సనా జావేద్ రియాక్ష్‌న్ వైరల్!
Sana Javed Reaction Viral

Sana Javed Reaction Viral in Pakistan Premier League 2024: షోయబ్ మాలిక్ భార్య, పాకిస్థానీ నటి సనా జావేద్‌కు సోషల్ మీడియా ట్రోలింగ్‌ కొత్తేమి కాదు. కాని ఒక్కొక్కసారి దానిని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. రెండు రోజుల క్రితం కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్‌ల మధ్య జరిగిన గేమ్‌కు సనా హాజరయ్యింది. దీంతో అక్కడి అభిమానులు సానియా, సానియా అంటూ నినాదాలు చేశారు. దీంతో సనా ఆగ్రహంగా ప్రేక్షకులవైపు చూసింది. ఇప్పుడా వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియో వైరల్ కావడంతో సనాకు సోషల్ మీడియాలో పలువురి నుంచి మద్దతు లభించింది. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న షోయబ్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం తన వల్ల కాదని చాలా మంది అమెకు సపోర్ట్ చేశారు.

షోయబ్ సనాతో తన పెళ్లిని ప్రకటించిన తర్వాత, తాను అప్పటికే షోయబ్ నుంచి ‘ఖులా’ తీసుకున్నానని సానియా స్పష్టం చేసింది.


Read More: టీమిండియాకు షాక్.. నాలుగో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం..

సానియాను ‘మోసం’ చేశాడని ఆరోపిస్తూ పాక్ క్రికెటర్‌పై భారత్, పాకిస్తాన్‌లోని నెటిజన్లు నిప్పులు చెరిగారు. భారత టెన్నిస్ స్టార్ పెళ్లికి ముందు ఒక సంవత్సరం పాటు ‘విడిపోవడం’, ‘విడాకుల’ గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వచ్చింది. దాంతో వారి విడాకుల ఊహాగానాలు వారి అభిమానులలో పెరిగాయి. ఏకంగా షోయబ్‌ను అభిమానులు మరొక పాకిస్తానీ మోడల్‌తో ముడిపెట్టారు. కానీ ఒక సంవత్సరం పాటు షోయబ్, సానియా ఇద్దరూ దీనిపై నోరు మెదపలేదు.

సానియా, షోయబ్‌లకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో వారి సంబంధానికి సంబంధించిన అన్ని ప్రతికూలతలకు దూరంగా ఉండేలా చేయడం ద్వారా అతన్ని కలిసి పెంచుతామని వారు ప్రమాణం చేశారు. షోయబ్ తిరిగి వివాహం చేసుకున్నప్పటికీ, సానియా ఒంటరిగా ఉంటూ దుబాయ్,హైదరాబాద్‌లో తన కుటుంబంతో నివసిస్తోంది.

T20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించని మాలిక్, వివిధ ఫార్మాట్లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ విశిష్ట అంతర్జాతీయ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. అతను 35 టెస్ట్ మ్యాచ్‌లు, 285 ODIలు, 124 T20I లలో పాకిస్థాన్ తరఫున పాల్గొన్నాడు. దాదాపు 12,000 పరుగులు, 200 పైగా వికెట్లు సాధించాడు. 2021లో బంగ్లాదేశ్‌తో జరిగిన T20Iలో పాకిస్థాన్ తరపున అతను చివరిసారిగా ఆడాడు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×