EPAPER

Shahid afridi:- అఫ్రిదీకి షాకిచ్చిన పాక్ క్రికెట్ బోర్డు

Shahid afridi:- అఫ్రిదీకి షాకిచ్చిన పాక్ క్రికెట్ బోర్డు

Shahid afridi:- పాకిస్థాన్ క్రికెట్ జట్టు నిలకడలేమికి ఎంత గొప్ప పేరుందో… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిలకడలేని నిర్ణయాలకు కూడా అంతే పేరుంది. పాక్ క్రికెట్ జట్టు ఎప్పుడు దారుణంగా ఆడుతుందో.. ఎప్పుడు విజృంభించి ప్యత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తుందో… ఎవ్వరూ ఊహించలేరు. గత టీ-20 వరల్డ్ కప్ సందర్భంగా పాక్ ఎలా ఆడిందో చూశాం. లీగ్ దశలో రెండు వరుస ఓటములతో అసలు సెమీస్ కూడా చేరదని అనుకున్న ఆ జట్టు… మిగతా మ్యాచ్ ల్లో రెచ్చిపోయి ఆడి… సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లోనూ అడుగుపెట్టింది. కానీ, తుదిపోరులో ఇంగ్లండ్ చేతిలో పరాభవం పాలైంది. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అచ్చంగా అలాగే వ్యవహరిస్తోంది.


పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా కొన్నాళ్ల కిందట నియమించిన షాహిద్ అఫ్రీదీకి… పాక్ క్రికెట్ బోర్డ్ షాకిచ్చింది. అతణ్ని ఆ పోస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. అఫ్రిదీ స్థానంలో 69 ఏళ్ల హరూన్‌ రషీద్‌ను చీఫ్‌ సెలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పీసీబీ వెల్లడించింది. దాంతో… పాక్ క్రికెట్ జట్టే కాదు… ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా నిలకడలేమికి నిదర్శనమా? అంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పగ్గాల్ని నజమ్‌ సేథీ చేపట్టాక… చీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్న మహ్మద్‌ వసీంను తప్పించి… ఆ పదవిలో తాత్కాలికంగా అఫ్రీదీని కూర్చోబెట్టారు. ఇప్పుడు అతడికి కూడా ఉద్వాసన పలికి… వయసు మీరిన హరూన్‌ రషీద్‌కు బాధ్యతలు అప్పజెప్పడం… పాక్ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌ తరఫున 23 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన హరూన్‌ రషీద్‌… గతంలోనూ 2015 నుంచి 2016 వరకు పాక్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా పని చేశాడు. మళ్లీ ఆ పదవిలోకి వచ్చిన రషీద్… ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి చవిచూసిన క్రికెట్ జట్టును ఏ మేరకు ప్రక్షాళన చేస్తాడో చూడాలి.


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×