EPAPER

NED vs BAN : పసికూనల పోరులో నెదర్లాండ్స్ గెలుపు.. చేతులెత్తేసిన బంగ్లాదేశ్..

NED vs BAN : పసికూనల పోరులో నెదర్లాండ్స్ గెలుపు..  చేతులెత్తేసిన బంగ్లాదేశ్..

NED vs BAN : రెండూ చిన్న జట్లే… అవి సంచలనాలు నమోదు చేసిన జట్లే…కాకపోతే ఈసారి వన్డే వరల్డ్ కప్ 2023 లో బంగ్లాదేశ్ కి ఇంకా ఆ అవకాశం రాలేదు. కానీ నెదర్లాండ్స్ మాత్రం సౌతాఫ్రికాపై విజయం సాధించి పెను సంచలనం సృష్టించింది. అయితే కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో  జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 87 పరుగుల తేడాతో విజయం సాధించి, అది గాలివాటం గెలుపు కాదని రుజువు చేసింది.


నెదర్లాండ్స్ టాస్ గెలిచి  మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ (3),  మ్యాక్స్ ఔడౌడ్ (0) ఇద్దరూ వచ్చిన వెంటనే వెనుతిరిగారు. 4 పరుగుల వద్ద 2 వికెట్లు పడిపోయాయి. అప్పటికే రెండు ఓవర్లే అయ్యాయి. ఈ దశలో బ్యాటింగ్ కి వచ్చిన వెస్లీ బరేసి (41) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత సిబ్రాండ్ (35) పరిస్థితికి తగినట్టుగా ఆడుతూ, వికెట్టు కాపాడుకోవడమే ధ్యేయంగా నిలిచాడు. ఈ 35 పరుగులు చేయడానికి తను 61 బాల్స్ తీసుకున్నాడంటే ఎలా ఆడాడో అర్థమవుతోంది.

ఒక దశలో 27 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులతో నెదర్లాండ్స్ విలవిల్లాడుతోంది. పరిస్థితిని గమనించిన కెప్టెన్, వికెట్ కీపర్ అయిన స్కాట్ ఎడ్వర్డ్ మ్యాచ్ ని తన భుజస్కంధాలపై మోశాడు. విలువైన 68 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ చివరికి 229 పరుగులైనా చేయగలిగిందంటే అది తన చలవే అని చెప్పాలి.


తర్వాత చివర్లో కోలిన్ అకెర్మాన్ (15), బాస్ డీ లీడే (17), వాన్ బీక్ (23) దూకుడుగా ఆడి జట్టు ఒక మోస్తరు స్కోరు చేయడంలో సాయపడ్డారు. చివరికి 50 ఓవర్లలో 229 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచారు. బంగ్లా బౌలింగ్ లో ఇస్లామ్ 2, తస్కిన్ అహ్మద్ 2, ముస్తాఫిజుర్ 2, మెహదీ హాసన్ 2, షకీబ్ 1 వికెట్టు తీశారు.

230 పరుగుల స్వల్ప లక్ష్య సాధనకు నడుం బిగించిన బంగ్లాదేశ్ వీరికన్నా దారుణంగా ఆడింది. అసలు ఆడుతాపాడుతా కొట్టేస్తారని అనుకుంటే, టపటపా వికెట్లు పారేసుకుంది. నిజానికి చెప్పాలంటే నెదర్లాండ్స్ కన్నా ముందు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టింది. వీరిమీద సీనియర్ అనే చెప్పాలి. కానీ కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది.

ఛేజింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఒక దశలో 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గిలగిల్లాడింది. అక్కడ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్ 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇది జట్టుకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. మరో ఓపెనర్ తంజిద్ హాసన్ (15) కూడా అవుట్ అయ్యాడు. అయితే ఫస్ట్ డౌన్ వచ్చిన మెహిదీ హాసన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ తను ఒక ఎండ్ లో ఉండగా, తనకి సపోర్ట్ ఇచ్చే వారే కరవయ్యారు.

హుస్సేన్ షాంతో (9), షకీబ్ అల్ హాసన్ (5), ముష్ఫిర్ రహీం (1) ఇలా టపటపా పడిపోయారు. ఇక బంగ్లా ఓటమి ఖాయమని అంతా డిసైడ్ అయ్యారు.  అయితే మహ్మదుల్లా 20, ముస్తాఫిజర్ రెహ్మాన్ (20), మెహిదీ హాసన్ (35) పరుగులు చేశారు. 100 లోపు ఆలౌట్ అవుతుందని అనుకున్న మ్యాచ్ ని 142 పరుగుల వరకు తీసుకువెళ్లి వీరు ముగ్గురూ జట్టు గౌరవం కాపాడారు.

ఇక నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకరన్ 4 వికెట్లు తీసి బంగ్లా నడ్డి విరిచాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్.. పెద్ద జట్లు అయిన పాకిస్తాన్, శ్రీలంక జట్లకు ఏ మాత్రం తీసిపోకుండా పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో ఉండిపోయింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×