EPAPER

Sunil Gavaskar: సర్ఫరాజ్ ఎందుకలా ఆడావ్? : సునీల్ గవాస్కర్ ప్రశ్న

Sunil Gavaskar: సర్ఫరాజ్ ఎందుకలా ఆడావ్? : సునీల్ గవాస్కర్ ప్రశ్న
Sunil Gavaskar recalls 'Don Bradman' remarks to question Sarfaraz's dismissal
 

Sunil Gavaskar recalls ‘Don Bradman’ remarks to question Sarfaraz’s dismissal: ‘నేను 200 పరుగులు చేసినా.. ఆ తర్వాత బంతిని ఎదుర్కునేటప్పుడు సున్నా దగ్గరే ఉన్నానని అనుకుంటాను’


ఈ మాటలన్నది ఎవరో కాదు సర్ బ్రాడ్ మేన్…
వీటిని గుర్తు చేసినది ఎవరో కాదు ద గ్రేట్ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్…

ఎందుకీ కోట్స్ చెప్పాడో తెలుసా…
టీమ్ ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ సర్ఫరాజ్ కోసం…తను 56 పరుగుల దగ్గర అవుట్ అయిన తీరుకి ఒకింత బాధపడ్డాడు. నువ్వు సెంచరీ చేస్తే చూడాలని ఆశపడ్డానని తెలిపాడు..


ఈ సమయంలో తనకి కొన్ని సూచనలు చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న అయిదో టెస్టులో రెండోరోజు సర్ఫరాజు 56 పరుగులతో టీ బ్రేక్ కి వెళ్లాడు. వచ్చీ రాగానే మొదటి బాల్ ని కట్ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. అలా టీ బ్రేక్ లాంగ్ బ్రేక్ అయిపోయింది.

Read more: 15 ఏళ్ల తర్వాత.. టాప్ ఆర్డర్ రికార్డ్ బ్రేక్ ఐదుగురు ఆఫ్ సెంచరీలు

ఈ విషయంపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ చక్కగా క్రీజులో కుదురుకున్నావ్. పిచ్ అర్థమైంది, బాల్ అర్థమైంది. షాట్లు తగులుతున్నాయి. అలాంటప్పుడు సంయమనం పాటించాలి.  టీ బ్రేక్ అయి వచ్చిన తర్వాత మళ్లీ కాసేపు డిఫెన్స్ ఆడాలి.

ఎందుకంటే ప్రత్యర్థి బౌలర్లు రిలాక్స్ అయి, కొత్త శక్తితో వస్తారు. కొత్త వ్యూహాలతో నిన్నెలా అవుట్ చేయాలని వస్తారు. అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా… అయినా ఆ బాల్ ని అలా వదిలేసినా బాగుండేది.. వెంటాడి వెంటాడి మరీ కొట్టావు..భారీ మూల్యం చెల్లించుకున్నావని అన్నాడు.

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దక్కిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకుని, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే, చాలా శ్రమించాలి. ఒక్కసారి కుదురుకున్నాక ఇంకెవరూ వారిని వేలెత్తి చూపించరు.. స్టార్టింగ్ పట్టాలెక్కేటప్పుడు కొంచెం జాగర్తగా ఆడాలని సీనియర్లు హితబోధ చేస్తున్నారు.

ఇదంతా ఎందుకంటే సర్ఫరాజ్ ఆట చూసి ముచ్చటపడి అందరూ తమకు తోచిన సలహాలిస్తున్నారని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×