BigTV English
Advertisement

Sania Mirza : టెన్నిస్ కు సానియా గుడ్ బై.. కెరీర్ సాగింది ఇలా.. రికార్డులెన్నో..

Sania Mirza : టెన్నిస్ కు సానియా గుడ్ బై.. కెరీర్ సాగింది ఇలా.. రికార్డులెన్నో..

Sania Mirza : భారత్ మహిళల టెన్నిస్ అంటే గుర్తొచ్చే పేరు ఒక్కటే అది సానియా మీర్జా. ఆమె ముందు ఎవరూ లేరు. ఆమె తర్వాత ఎవరూ కనిపించడంలేదు. 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా రాణించిన ఆమె ఆటకు వీడ్కోలు పలికింది. చివరి టోర్ని దుబాయ్ ఓపెనలో తొలి రౌండ్ లోనే ఓటమి చవిచూసింది. సానియా సృష్టించిన రికార్డులు, సాధించిన ఘనతలు మరో భారత్ క్రీడాకారిణి ఇప్పటిలో అందుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే సానియా 3 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. 3 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. కెరీర్ మొత్తం మీద 43 డబుల్స్ టైటిల్స్ సాధించింది. 91 వారాలపాటు డబుల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగింది.


కుటుంబ నేపథ్యం..
సానియా మీర్జా 1986లో ముంబైలో పుట్టింది. ఆ తర్వాత ఆమె కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. తండ్రి శిక్షణలో టెన్నిస్ లో ఓనమాలు నేర్చుకున్న సానియా 2001లో సీనియర్ సర్క్యూట్ లో ప్రవేశించింది. 2002 లో ఆసియా క్రీడల మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్ తో కలిసి క్యాంస పతకం గెలిచి అందర్నీ ఆకర్షించింది. 2003 లో జూనియర్ బాలికల విభాగంలో వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించింది. 2005 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తో గ్రాండ్ స్లామ్ టోర్నిలో అడుగుపెట్టింది. అదే ఏడాది యూఎస్ ఓపెన్ సింగిల్స్ లో నాలుగో రౌండ్ కు చేరి ఆశ్చర్య పరిచింది.

రికార్డులు ఎన్నో..
డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సానియా రికార్డు సృష్టించింది. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఏకైక భారత్ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2007లో సింగిల్స్ లో 27 ర్యాంకుకు చేరుకుంది. ఇది ఆమె కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకు. 2015 లో డబుల్స్ లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి కూడా ఆమె. సానియా 21 నెలల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఆసియా క్రీడల్లో మొత్తం 8 పతకాలు సాధించింది. అందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు క్యాంసాలు ఉన్నాయి. 2010 కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ లో రజతం, డబుల్స్ లో క్యాంసం సాధించి సత్తా చాటింది.


కెరీర్ గ్రాండ్ స్లామ్..
కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచింది. ఇందులో మూడు డబుల్స్‌, మూడు మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిళ్లు ఉన్నాయి. సానియా ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం ఒక్కసారైనా సొంతం చేసుకుంది. 2015 వింబుల్డన్‌, 2015 యుఎస్‌ ఓపెన్‌, 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ లో డబుల్స్‌ టైటిల్స్‌ సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహేష్ భూపతితో కలిసి 2009 లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 2012 లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించింది. బ్రునో సోర్స్‌తో కలిసి 2014 యుఎస్‌ ఓపెన్‌ టైటిల్ కైవసం చేసుకుంది.

రెండో ఇన్నింగ్స్..
2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న చేసుకున్న సానియా.. 2018లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడు పేరు ఇజ్ హాన్. బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలం టెన్నిస్ కు విరామం చెప్పిన సానియా 2020లో తిరిగి రాకెట్ పట్టింది. హోబర్ట్ అంతర్జాతీయ టోర్నిలో డబుల్స్ టైటిల్ గెలిచింది.

తీరని కల
ఒలింపిక్స్ పతకం సాధించాలన్న సానియా కల నెరవేరలేదు. 2008, 2012, 2016, 2020 లో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న పతకం సాధించడంలో విఫలమైంది. సానియా 2006లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. 2016లో పద్మభూషణ్ పురస్కారంతో భారత్ ప్రభుత్వం గౌరవించింది.

కెరీర్‌ రికార్డులు ..
సింగిల్స్‌ : విజయాలు 271, పరాజయాలు 161
డబుల్స్‌: విజయాలు 536, పరాజయాలు 248
కెరీర్‌ ప్రైజ్‌మనీ: 72 లక్షల 65 వేల 246 డాలర్లు (రూ. 60 కోట్ల 20 లక్షలు)

Related News

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Big Stories

×