EPAPER

Sachin Tendulkar: ఆ మాట నిజమేనా?.. కొడుకు కోసం సచిన్ ఆ పని చేశాడా?

Sachin Tendulkar: ఆ మాట నిజమేనా?.. కొడుకు కోసం సచిన్ ఆ పని చేశాడా?

Sachin TendulkarSachin Tendulkar: ఐపీఎల్ సీజన్ మరో మూడు రోజుల్లో ఘనంగా ప్రారంభం కానుంది. అయితే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా ముంబై జట్టులో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. వెళ్లడని అనుకున్న రోహిత్ ఎందుకు వెళ్లాడనేది అందరికీ పెద్ద పజిల్ లా అనిపించింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు ఎవరిదో కాదు అపర కుబేరుడు ముఖేష్ అంబానీది… అందుకనే ఇంక తప్పలేదని అంతా అనుకున్నారు.


ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్పందిస్తూ…రోహిత్ భయ్ నా భుజాల మీద చెయ్యి వేసి నడిపిస్తాడని తెలిపాడు. దీనికి రోహిత్ అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో మరోక వాదన తెరపైకి వచ్చింది. అదేమిటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించడం వెనుక సచిన్ టెండుల్కర్ ఉన్నాడనే వాదన వినిపిస్తోంది.

ఎందుకంటే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నాడు. అయితే 2023 సీజన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అర్జున్ కి 4 మ్యాచ్ ల్లోనే అవకాశం వచ్చింది. కేవలం తండ్రి ప్రోత్సాహంతోనే అర్జున్ కి కెరీర్ సరిగా లేకపోయినా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని అంటున్నారు. అంటే మొదట రూ.20 లక్షలు ఇచ్చారు. తర్వాత తనేమీ పెద్ద స్కోర్లు చేయకపోయినా సరే, రూ.10 లక్షలు పెంచి రూ.30 లక్షలు చేశారు. ఇది కూడా వివాదాస్పదమైంది.


సచిన్ టెండూల్కర్ కొడుకు మీద పుత్రప్రేమతో వ్యవహరిస్తున్నాడని, ముంబై జట్టుపై బలవంతంగా రుద్దుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మపై ఆ ఒత్తిడి ప్రత్యక్షంగా పడిందని అంటున్నారు. 2023లో అర్జున్ 4 మ్యాచ్ లు ఆడాడు. కేవలం 92 రన్స్ మాత్రమే చేశాడు. తను ఆల్ రౌండర్ కావడంతో.. 3 వికెట్లు కూడా తీసుకున్నాడు.

ఐపీఎల్ లో చివరికి వెళ్లే కొద్దీ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు ఫామ్ లో లేని ఆటగాడిని, అన్ స్కిల్డ్ ఆటగాడిని పట్టుకుని ఊగిసలాడటం కెప్టెన్ కి కత్తిమీద సాములాంటిదే. తను కేవలం బెస్ట్ ఫీల్డర్ గానే ఉన్నాడని అంటున్నారు. అంతేకాదు పుట్టుకతోనే తను సచిన్ కొడుకు అనే ట్యాగ్ తో ఎదిగాడు. లోపల ఎంతో కొంత కాంప్లెక్స్ నడుస్తుంటుంది. అది బహుశా రోహిత్ శర్మకి నచ్చలేదో, లేక ఆటగాడిగా ప్రతిభ చూపించ లేకపోతున్నాడని అనుకున్నాడో మొత్తానికి పక్కన పెట్టేశాడు.

తన కొడుకు ప్రతిభకి…రోహిత్ శర్మ అడ్డంకిగా ఉన్నాడని భావించే సచిన్ టెండూల్కర్ వెనక నుంచి కథంతా నడిపించాడని, అందుకే రోహిత్ శర్మని తప్పించి హార్దిక్ ను తీసుకొచ్చారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే, సచిన్ క్రికెట్ చరిత్రలో ఇదొక మచ్చగానే మిగిలిపోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతకుమించి మాట్లాడటానికి ఎవరికి మనసు రావడం లేదు.

Also Read: Cricket League Match: అసలు లీగ్ మ్యాచ్ లు ప్రారంభం ఎక్కడ?

అంతేకాదు దీని వెనుక నిజానిజాలు కూడా ఎవరికీ తెలీవు. ఇది నిజమైతే అర్జున్ టెండూల్కర్ ఆడినా ఆడకపోయినా ముంబై ఇండియన్స్ తో కలిసి మ్యాచ్ లన్నీ ఆడితే మాత్రం ఇది నిజమనే అనుకోవాలి. అది హార్దిక్ పాండ్యాకు రాబోవు రోజుల్లో తలనొప్పే అని చెప్పాలి. ఒకవేళ కప్పు రాకపోతే కెప్టెన్ ని అంటారు గానీ, అర్జున్ వల్ల అని అనరు. ఆ సంగతి అనుభవంతోనే హార్దిక్ కి బోధపడుతుంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×