EPAPER

Sachin : సామాన్యుడిలా సచిన్… ఫిదా అయిన ఫ్యాన్స్…

Sachin : సామాన్యుడిలా సచిన్… ఫిదా అయిన ఫ్యాన్స్…

Sachin : భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. అతి సామాన్యమైన వ్యక్తిలా… రోడ్డు పక్కన కారు ఆపి, ఓ టీ షాప్ లో చాయ్ తాగుతూ, రస్క్ తింటూ… ఎంజాయ్ చేశాడు. బెళగాం-గోవా జాతీయ రహదారిపై తాను తీసుకున్న చిన్న బ్రేక్ ను షూట్ చేసి… సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో… లక్షలకు లక్షలు వ్యూస్ వస్తున్నాయి. సచిన్ సింప్లిసిటీకి అభిమానులంతా ఫిదా అవుతున్నారు.


సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ రంజీ సీజన్ లో ముంబయి జట్టును వీడి గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో రంజీ ట్రోఫీ గ్రూప్ దశలో అర్జున్‌కు ముంబై జట్టులో స్థానం దక్కింది. అయితే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. నాకౌట్ దశకు వచ్చేసరికి అర్జున్‌ను జట్టు నుంచి తప్పించారు. దాంతో అర్జున్‌ టెండూల్కర్‌ గోవాకు తరలి వెళ్లాడు. కొడుకుతో పాటు గోవా వెళ్తూ… చాయ్ తాగేందుకు రోడ్డు పక్కన కారు ఆపి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు… మాస్టర్.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఉదయాన్నే చిరుతిండితో వేడి వేడి చాయ్‌ తాగితే ఆ మజానే వేరంటూ వీడియో తీసుకున్నాడు… సచిన్. కారు డోరు దగ్గరి నుంచి అంతా చూస్తున్న అర్జున్‌ ను కూడా… టీ తాగేందుకు రమ్మని పిలిచాడు. టీ షాప్ ఓనర్ తో మాట్లాడి… వారందరితో తానే స్వయంగా సెల్ఫీ తీసుకున్నాడు. అంతేకాదు… స్కూల్ కు వెళ్తున్న ఓ అమ్మాయిని కూడా పలకరించి… చక్కగా చదువుకోమని సూచించాడు. ఒక్కసారిగా కళ్ల ముందు సచిన్ చేస్తున్న సందడిని చూసిన స్థానికులు… ఇదంతా కలా? నిజమా? అని ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సచిన్ వీడియోను చూసిన అభిమానులు… ఎంత గొప్పస్థాయిలో ఉన్నా ఒదిగి ఉండటాన్ని సచిన్ ను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×