EPAPER
Kirrak Couples Episode 1

Virat Kohli : సచిన్ నా రియల్ హీరో.. విరాట్ కోహ్లీ..

Virat Kohli : సచిన్ నా రియల్ హీరో.. విరాట్ కోహ్లీ..

Virat Kohli : కోల్‌కత్తాలో తన పుట్టినరోజున జరగిన మ్యాచ్ తనకెంతో ప్రత్యేకమైనదని.. అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తున్నారో కూడా తెలుసుని విరాట్ కోహ్లీ అన్నాడు. సౌతాఫ్రికాపై గెలిచిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా విరాట్ కొహ్లీ తన మనసులో మాటలు కొన్ని చెప్పాడు.


“సచిన్ రికార్డ్‌ను లెవల్ చేయడం సంతోషంగా ఉంది. అయితే నా చిన్నతనం నుంచి సచిన్ ఆటను చూసి పెరిగాను. తనే నా ఇన్సిపిరేషన్…నిజం చెప్పాలంటే నా గురువు కూడా తనే”, అని అన్నాడు. “నేను సెంచరీ చేయగానే మొదటిసారి తను పంపిన అభినందనలు చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యా.. తర్వాత ఆనందం వేసింది”, అని అన్నాడు.

“ఇది చాలా కీలకమైన మ్యాచ్. అందుకే ఉదయమే చాలా ఉత్సాహంతో నిద్ర లేచాను. అన్ని మ్యాచ్‌ల్లా దీనిని భావించలేదు. ఎందుకంటే ఇది ఒక కఠినమైన పిచ్. అంతే కాదు దీనిపై శక్తివంతమైన జట్టుతో తలపడుతున్నామని తెలుసు. అందుకే ఈ విజయం అందరిలో స్ఫూర్తినింపింది”. “నా సెంచరీ కూడా అందరికీ ఆనందాన్నిచ్చింది. ఇంతమందిని సంతోషపెట్టినందుకు నాకెంతో సంత్రప్తిగా ఉంది. మీ అభిమానానికి ధన్యవాదాలు”, అని తెలిపాడు. ఈ మ్యాచ్  కాదు, నా పుట్టినరోజు కాదు… ఈ ఒక్క సెంచరీని అభిమానులందరూ అన్నిటికన్నా స్పెషల్ గా మార్చేశారని నవ్వుతూ చెప్పాడు.


కోహ్లీ తన రికార్డ్ సమం చేయగానే క్రికెట్ దేవుడు సచిన్ వెంటనే స్పందించాడు. ఒక సందేశం పంపాడు.
 “విరాట్ కంగ్రాట్స్, నా రికార్డ్ ని ఒక భారతీయుడే దాటాలని ఆశించాను. నా కోరిక నెరవేర్చావు” అని అభినందనలు చెబుతూ అన్నాడు.

12 ఏళ్ల క్రితం సచిన్ రిటైర్మెంట్ రోజున జరిగిన ఒక పెద్ద వేడుకలో ప్రముఖ అతిథులందరూ పాల్గొన్నారు. అందులో సల్మాన్ ఖాన్ ఒక ప్రశ్న సచిన్ ని అడిగాడు. మీ రికార్డ్స్ ని దాటేవాళ్లు, మీ తర్వాత ఇండియన్ క్రికెట్ లో ఎవరున్నారని అడిగాడు.

యువకులు చాలామంది ఉన్నారు. కానీ నాకు తెలిసి, కోహ్లీ, రోహిత్ ఇద్దరికి మాత్రం అవకాశం ఉందని చెప్పాడు. ఆ మాట నేడు అక్షరాల నిజమైంది. అంటే 12 ఏళ్ల క్రితమే సచిన్ ఊహించాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు నా రికార్డ్ కొడతారని, అదే నిజమైంది. చూశారా, సచిన్ దూర దృష్టి అని అందరూ కొనియాడుతున్నారు.

జడ్జిమెంట్ అంటే అలా ఉండాలని చెబుతున్నారు. నిజానికి సచిన్ రిటైర్మెంట్ టైమ్ కి, కోహ్లీ జట్టులోకి వచ్చి మూడేళ్లే అవుతుంది. అప్పటికి కోహ్లీ పెద్ద ప్రభావం కూడా చూపించలేదు. అయినా సరే, కోహ్లీలో ఉన్న పట్టుదల, అంకిత భావం, ఆట తీరుని తాను పసిగట్టాడు. రాబోయే రోజుల్లో ఇండియన్ క్రికెట్ కి ఇరుసులా మారతాడని అనుకున్నాడు. నేడు అదే నిజమైంది.

Related News

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

Big Stories

×