EPAPER
Kirrak Couples Episode 1

SA vs IND : చెలరేగిన భారత పేసర్లు.. సఫారీ గడ్డపై కొత్త రికార్డులు..

SA vs IND : చెలరేగిన భారత పేసర్లు.. సఫారీ గడ్డపై కొత్త రికార్డులు..

SA vs IND : టీమ్ ఇండియా 2024 కొత్త సంవత్సరాన్ని ఎప్పటిలాగే ఘనంగా ప్రారంభించింది. టీమ్ ఇండియా ఒకొక్కసారి సంచలనాలు నమోదు చేస్తుంది. మరోసారి అదే స్థాయిలో పేరు కూడా పోగొట్టుకుంటుంది. కానీ ఇప్పుడు సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో నిప్పులు చెరిగే బంతులతో మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. తర్వాత బూమ్రా, ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసి లాంఛనం పూర్తి చేశారు. మొత్తానికి సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 23.2 ఓవర్లో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.


టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ పై ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. ఇకపోతే ఒక శతాబ్దం తర్వాత సౌతాఫ్రికా జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం.

నిజానికి టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ బ్యాటింగ్ తీసుకోవడం అతి పెద్ద తప్పిదంగా మారిపోయింది. పిచ్ నుంచి లబ్ధి పొంది తర్వాత టీమ్ ఇండియాను దెబ్బతీయాలని భావించి, వారే ఘోరంగా దెబ్బయిపోయారు. పిచ్ ని అంచనా వేయడంలో పొరపాటు జరిగిందా? లేదంటే తొలిటెస్టులో టీమ్ ఇండియా ఆటగాళ్ల ఆట చూసి, బౌలర్ల తీరు చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ కి వచ్చారా? అనేది అర్థం కాలేదు.


అయితే సిరాజ్ ని తక్కువగా అంచనా వేయడమే కొంప ముంచింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడాన్ని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ పిచ్ సహకరిస్తే, తనెంతటి ప్రమాదకర బౌలర్ అనేది మరోసారి రుజువైంది. నిప్పులు చెరిగే బంతులను సంధించి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

మ్యాచ్ ప్రారంభమైన 3.2 ఓవర్ నుంచి వికెట్ల పతనం ప్రారంభమైంది. మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ మొదలైంది. ఓపెనర్ మార్కరమ్ (2) ని పెవిలియన్ పంపించాడు. తర్వాత మరో రెండు ఓవర్లు ముగిశాయి. కెప్టెన్ ఎల్గర్ (4) సిరాజ్ బంతికి బలి అయ్యాడు. తొలి టెస్ట్‌లో 186 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించిన తనని సిరాజ్ వెనక్కి పంపించాడు. తర్వాత మరో మూడు ఓవర్లు గడిచాయి. ఈ లోపు బూమ్రా తనేం తక్కువ కాదని భావించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (3)ను అవుట్ చేశాడు.

తర్వాత మహ్మద్ సిరాజ్ కి లైన్ అండ్ లెంగ్త్ దొరికింది. కరెక్ట్ గా అక్కడే బాల్స్ వేశాడు. త్వరత్వరగా మరో నాలుగు వికెట్లు తీశాడు. అలా టోనీ డి జోర్జి (2)ని వెనక్కి పంపించాడు. అప్పటికి సౌతాఫ్రికా స్కోరు 9.2 ఓవర్లలో 4 వికెట్లకు కేవలం 11 పరుగుల మాత్రమే. తర్వాత డేవిడ్ బెడింగ్ హమ్ (12), వెరినే (15), మార్కో జాన్సన్ (0) లను అవుట్ చేశాడు. దీంతో 7 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 45 పరుగులు చేసింది. తర్వాత మరో వికెట్ బూమ్రా ఖాతాలో పడింది. మిగిలిన రెండు వికెట్లను ముఖేష్ కుమార్ తీసి సౌతాఫ్రికా కథ ముగించాడు.

సిరాజ్ 6, బూమ్రా 2, ముఖేష్ 2 వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ క్రష్ణకి ఒక్క వికెట్టు దక్కలేదు.

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా కూడా తడబడుతోంది. సౌతాఫ్రికా బ్యాటర్లు తేలిపోయిన కఠినమైన పిచ్ పై మనవాళ్లు కూడా అదే రీతిలో అవుట్ అవుతారా? దీని నుంచి లాభపడతారా? అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డక్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇద్దరూ ఆడుతున్నారు. మరి వీరిద్దరూ ఎంతవరకు తొలిరోజు ఆటను ముగిస్తారనేది వేచి చూడాల్సిందే.

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×