EPAPER
Kirrak Couples Episode 1

SA vs BAN : సౌతాఫ్రికా అదుర్స్.. బంగ్లాదేశ్ బెదుర్స్.. రెండో స్థానానికి దక్షిణాఫ్రికా

SA vs BAN : సౌతాఫ్రికా అదుర్స్.. బంగ్లాదేశ్ బెదుర్స్.. రెండో స్థానానికి దక్షిణాఫ్రికా

SA vs BAN : సఫారీలు మళ్లీ జూలు విదిల్చారు. 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ని కూడా ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ తరహాలో ఆడేస్తున్నారు. వచ్చిన బాల్ ని వచ్చినట్టు బాదడం అనే కాన్సెప్ట్ తోనే ఆడుతున్నట్టుగా ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబై వాంఖేడి స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేజింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ 233 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వీరోచితంగా పోరాడిన మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా (111) సెంచరీ వృథా అయ్యింది.


2023 వరల్డ్ కప్ లో ఇది అప్పుడే సౌతాఫ్రికా సాధించిన నాలుగో భారీ స్కోర్. వీరి దూకుడు మామూలుగా లేదు. ప్రతీ జట్టుని ఒక రేంజ్ లో ఉతికి ఆరబెట్టేస్తున్నారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా మొదట్లో ఆచితూచి ఆడింది. ఆరు ఓవర్లలో  33 పరుగులు చేసింది. ఓపెనర్ హెండ్రిక్స్ (12)ను ఇస్లామ్ అవుట్ చేశాడు. తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన వాండర్ డసెన్ (1) ను మిరాజ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి 7.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 36 పరుగుల మీద ఉంది.

మొదట్లో పట్టు బిగించిన బంగ్లాదేశ్ బౌలింగ్ నెమ్మదిగా గాడి తప్పింది. ఈ దశలో ఓపెనర్ డికాక్ విజృంభించాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు సాధించిన తను మరో సెంచరీ కొట్టాడు. అయితే అలాంటి ఇలాంటిది కాదు…ఒక దశలో డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ 174 పరుగుల వద్ద శాంతించి అవుట్ అయ్యాడు. అప్పటికే 7 సిక్స్ లు, 15 ఫోర్లతో 140 బంతుల్లో ఆ స్కోర్ సాధించాడు. దొరికిన బాల్ ని దొరికినట్టు చితక్కొట్టాడు.


ఈ సమయంలో అగ్నికి వాయువు తోడైనట్టు డికాక్ కి…మరో బ్యాట్స్ మెన్ క్లాసెన్ తోడయ్యాడు. తను 49 బంతుల్లో 90 పరుగులు చేసి తనూ ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. 8 సిక్స్ లు, 2 ఫోర్లతో ఎడాపెడా బాదేశాడు. సిక్స్ కొట్టడం ఇంత సులువా అన్నట్టు కొట్టేశాడు. వీళ్ల దెబ్బకి చివరి 13 ఓవర్లలో సౌతాఫ్రికా 174 పరుగులు చేసింది. అంతేకాదు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలింగ్ లో మహ్మద్ 2, మిరాజ్, షకీబ్, షోరీపుల్ తలా ఒక వికెట్టు తీశారు.

భారీ లక్ష్యంతో ఛేజింగ్ కి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు మొదట 6 ఓవర్లలో నింపాదిగానే ఆడారు. ఓవర్ కి 5 రన్ రేట్ చొప్పున 30 పరుగులు చేశారు. ఇక అక్కడ నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.
మార్కో జాన్సన్ వేసిన ఏడో ఓవర్ నుంచి బంగ్లాదేశ్ గాడి తప్పింది.
 ఓపెనర్లు హాసన్ (12), లిటన్ దాస్ (22) పరుగులు చేసి అవుట్ అయ్యారు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన సజ్మాల్ శాంటో (0) ఎదుర్కొన్న తొలి బంతికే ఫస్ట్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
కళ్లు మూసి తెరిచేలోపు షకీబ్ అల్ హాసన్ (1), ముష్ఫీకర్ (8) అవుట్ అయ్యి, వచ్చినంత త్వరగా పెవెలియన్ బాట పట్టారు.
ఒక దశలో 22 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 81 పరుగులు చేసి కష్టాల కడలిలో ఈదుతూ కనిపించింది.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా ఒక ఎండ్ లో ఉండి, వికెట్లు పడుతున్నా మొక్కవోని ధైర్యంతో నిలిచాడు. టెయిల్ ఎండర్స్ తో కలిసి ఇన్నింగ్స్ ని ముందుకి నడిపించాడు. ఒక గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చూశాడు. ఎట్టకేలకు 111 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 111 పరుగులు చేశాడు. చివరికి 9 వికెట్టు రూపంలో వెనుతిరిగాడు.
తర్వాత కాసేపటికి బంగ్లాదేశ్ కథ ముగిసింది.

సౌతాఫ్రికా బౌలర్స్ లో గెరాల్డ్ కొట్టీ 3. మార్కో యన్సెన్ 2, విలియమ్స్ 2, రబాడా 2, కేశవ్ మహరాజ్ 1 వికెట్టు తీశారు.

ఈ పరాజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో అడుక్కి వెళ్లిపోయింది. సౌతాఫ్రికా న్యూజిలాండ్ ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ కి వెళ్లింది. 

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×