EPAPER

SA vs AFG : ఆఫ్గాన్ పై గెలిచి.. ఊపిరి పీల్చుకున్న సౌతాఫ్రికా..

SA vs AFG : ఆఫ్గాన్ పై గెలిచి.. ఊపిరి పీల్చుకున్న సౌతాఫ్రికా..

SA vs AFG : ఎట్టకేలకు ఆఫ్గనిస్తాన్ అనితర పోరాటం ప్రపంచకప్ లో ముగిసింది. చివరి మ్యాచ్ లో సౌతాఫ్రికాను చివరివరకు కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. అయితే సఫారీలకు విధించిన 244 పరుగుల లక్ష్యం సరిపోలేదు. అయితే వారికి గెలవడానికి 47.3 ఓవర్లు అవసరమైంది. మొత్తానికి గెలిచి బతుకుజీవుడా అనుకున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 9 మ్యాచ్ ల్లో ఏడింట నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.


ఆఫ్గనిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నారు. సౌతాఫ్రికా ముందు 245 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. దీంతో సౌతాఫ్రికా తడబడుతూ ఆడి లక్ష్యాన్ని చేరుకుంది. 10 ఓవర్ల వరకు ఓపెనర్లు బాగానే ఆడారు. 61 పరుగులు చేశారు. ఆ సమయంలో 23 పరుగులు చేసిన కెప్టెన్ బవుమా అవుట్ అయ్యాడు. తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలో డికాక్ అవుట్ అయ్యాడు. అయితే అంతకుముందు ఫస్ట్ డౌన్ వచ్చిన వాన్ డెర్ డస్సెన్ (76 నాటౌట్ ) ఒక ఎండ్ లో నిలిచాడు. తన ముందు సహచరుల వికెట్లు పడుతున్నా మొక్కవోని ధైర్యంతో అలా ఆడాడు.

డికాక్ (41), మారక్రమ్ (25), క్లాసెన్ (10), డేవిడ్ మిల్లర్ (24) అవుట్ అయిపోయారు. ఒక దశలో 139 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడినట్టు కనిపించింది. అప్పటికి 27 ఓవర్లు మాత్రమే  అయ్యాయి. మళ్లీ ఆస్ట్రేలియాకి పట్టిన గతే పడుతుందా? అని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఫెలుక్వాయో  (39 నాటౌట్) సహాయంతో డస్సెన్ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపు కోసం 47.3 ఓవర్ల వరకు ఆడారంటే ఆఫ్గాన్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. రషీద్ ఖాన్ చక్కని బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ నబీ 2, రహ్మాన్ ఒక వికెట్టు తీసుకున్నారు.


మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్…ఆస్ట్రేలియా మ్యాచ్ షాక్ నుంచి ఇంకా కోలుకోనట్టుగా కనిపించింది. అది మ్యాచ్ పై కనిపించింది. అయితే ఓపెనర్లు ఇద్దరూ కూడా నిలదొక్కుకోలేదు. గుర్బాజ్ (25), ఇబ్రహీం జడ్రాన్ (15) పరుగులు చేసి అవుట్ అయిపోయారు. తర్వాత కెప్టెన్ షాహిది (2) అయిపోయాడు. వీళ్లు ముగ్గురూ ఒకొక్క ఓవర్ తేడాలో అయిపోయారు. 8 వ ఓవర్ లో గుర్బాజ్, 9వ ఓవర్ లో జడ్రాన్, 10వ ఓవర్ లో షాహిది క్యూ కట్టేసారు . ఇది మ్యాచ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది.  

కాకపోతే తర్వాత వచ్చి అజ్మతుల్లా (97 నాటౌట్ ) ఒంటరి పోరాటం చేశాడు. తనకి మరో ఎండ్ లో సహకారం ఇచ్చేవారే కరువయ్యారు. రహ్మత్ షా (26), ఇక్రమ అలిఖిల్ (12), మహ్మద్ నబీ (2), రషీద్ ఖాన్ (14), నూర్ అహ్మద్ (26) సాయంతో అజ్మతుల్లా 244 పరుగులకు స్కోరుని తీసుకెళ్లాడు. మరో 30 పరుగులుగానీ చేసి ఉంటే, సౌతాఫ్రికాకి చుక్కలైతే కనిపించేవని అంతా అనుకున్నారు. ఓడినా ఆఫ్గాన్ పోరాట పటిమను అందరూ మెచ్చుకున్నారు. సౌతాఫ్రికా బౌలింగ్ లో నిగిడి 2, గెరాల్డ్ కొయిట్టీ 4, కేశవ్ మహారాజ్ 2, ఫెలుక్వాయో ఒక వికెట్ తీసుకున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×