EPAPER

U17 World Wrestling: అండర్ 17 ప్రపంచ కుస్తీ పోటీల్లో భారత్‌కు కాంస్యం.. 110 కేజీల క్యాటగిరీలో రోనక్ దహియా విజయం

U17 World Wrestling: అండర్ 17 ప్రపంచ కుస్తీ పోటీల్లో భారత్‌కు కాంస్యం.. 110 కేజీల క్యాటగిరీలో రోనక్ దహియా విజయం

U17 World Wrestling| జోర్డాన్ దేశ రాజధాని అమ్మాన్ లో జరుగుతున్న అండర్ 17 ప్రపంచ కుస్తీ పోటీలు (ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్) జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత దేశానికి కాంస్య పతకం లభించింది. ప్రపంచ కుస్తీ పోటీల్లోని 110 కేజీ గ్రెకో రోమన్ క్యాటగిరీలో మంగళవారం, ఆగస్టు 20 రాత్రి కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత దేశానికి చెందిన రెజ్లర్ రోనక్ దహియా విజయం సాధించాడు.


అండర్ 110 కేజీ క్యాటగిరీలో ప్రపంచ టాప్ 2 ర్యాంకర్ అయిన రోనక్ దహియా.. టర్కీకి చెందిన ఎమ్రుల్లా కాప్ కాన్ ని 6-1 తేడాతో చిత్తుగా ఓడించాడు. భారతదేశానికి అండర్ 17 కుస్తీ పోటీల్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్ లో సిల్వర్ మెడల్ కోసం రోనక్ దహియా.. హంగేరి దేశానికి చెందిన రెజ్లర్ జోల్టాన్ జాకోతో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 2-0 స్కోర్ తో జోల్టాన్ పైచేయి సాధించాడు. దీంతో జోల్టాన్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు.

ఆ తరువాత జోల్టాన్ ఫైనల్ మ్యాచ్ లో యుక్రెయిన్ కు చెందిన రెజ్లర్ ఇవాన్ యాంకోవ్‌స్కీతో తలపడగా.. జోల్టాన్ ని 13-4 స్కోర్ తో టెక్నికల్ పాయింట్లతో ఇవాన్ చిత్తుగా ఓడించి 110 కేజగిరీ చాంపియన్ షిప్ గెలుచుకున్నాడు.


ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో శిక్షణ పొందిన భారత రెజ్లర్ రోనక్ దహియా.. అండర్ 17 ప్రపంచ చాంపియన్‌షిప్ తో తొలిగా 8-1 స్కోర్ తో అర్ టుర్ మన్‌వెలియాన్ పై విజయం సాధించాడు. ఆ తరువాత డేనీల్ మస్ లకౌపై టెక్నికల్ పాయింట్లతో గెలుపొందాడు.

Also Read: పెళ్లి కాకముందే తండ్రైన మంచి ఆటగాడు.. ఇప్పుడు మళ్లీ..

అయితే భారత్ కు రెండో మెడల్ సాధించే చాన్స్ ఇంకా ఉంది. 51 కేజీల కేటగిరీలో ఇండియన్ రెజ్లర్ సాయినాథ్ పార్ధీ వరుసగా రెండు మ్యాచ్ లు గెలిస్తే పతకం సాధించే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన డొమినక్ మైకేల్ మునరెట్టోతో జరిగే రెపీచేజ్ బౌట్ లో గెలిస్తే.. అతను కాంస్య పతకం మ్యాచ్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అర్మేనియాకు చెందిన సర్గీస్ హరుత్యునాన్, జార్జియాకు చెందిన లూరీ చాపిజైడ్ మధ్య జరిగే మ్యాచ్ లో విన్నర్ తో సాయినాథ్ తలపడాల్సి ఉంటుంది.

ఇంతకుముందు సాయినాథ్ అజర్‌బైజాన్ రెజ్లర్ తుషాన్ దాష్‌ధిమిరోవ్ తో జరిగిన తొలి బౌట్ లో 1-5 తో ఓడిపోయాడు.

Also Read: బీసీసీఐకి.. కాసులు కురిపిస్తున్న ఐపీఎల్

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×