EPAPER

Rohit Sharma : టర్నింగ్ పిచ్ లు అంటే నేను ఒప్పుకోను: రోహిత్ శర్మ

Rohit Sharma : టర్నింగ్ పిచ్ లు అంటే నేను ఒప్పుకోను: రోహిత్ శర్మ
rohit sharma press conference

rohit sharma press conference (sports news today):


ఇండియాలో టర్నింగ్ పిచ్ లు అనే అంశాన్నిటీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాడు. ధైర్యంగా ప్రపంచ మీడియాని ఎదిరించి మాట్లాడుతున్నాడు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, తనని ఎంత డీ గ్రేడ్ చేసినా, తను ఒకటే స్టాండ్ పై నిలిచి మాట్లాడుతున్నాడు.

ముఖ్యంగా రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ లో నాలుగో రోజు పిచ్ స్పిన్ కి టర్న్ కావడంతో ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తిరిగి ఇండియాలో టర్నింగ్ పిచ్ లు అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. 


ఇండియాలో ఇలాంటి పిచ్ లు చేయమని మేం ఎప్పుడూ ఎవరికీ  చెప్పమని అన్నాడు. అందరిలాగే మేం కూడా రెండురోజుల ముందే గ్రౌండ్ కి వెళ్లి చూస్తామని అన్నాడు.  

ఎలాంటి పిచ్ చేయాలనేది క్యూరేటర్ ఇష్టమని అన్నాడు. మరి మేం విదేశాల్లో ఆడినప్పుడు, ఇలా ఎప్పుడూ పిచ్ లను విమర్శించలేదని అన్నాడు. సౌతాఫ్రికా పిచ్ లపై మేం గెలవలేదా? అదెలాంటి పిచ్ ? అని ప్రశ్నించాడు. ఆఖరికి ఐసీసీ కూడా అది నాసిరకం పిచ్ అని తేల్చిందని అన్నాడు.

ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టెస్టుల్లో మూడు విభిన్నమైన పిచ్ లపై ఆడామని గుర్తు చేశాడు. హైదరాబాద్ పిచ్ అయితే మందకొడిగా ఉందని, బాల్ నెమ్మదిగా బ్యాట్ మీదకి వచ్చిందని అన్నాడు. వైజాగ్ లో అయితే మూడో రోజు నుంచి టర్న్ అయ్యిందని అన్నాడు.

రాజ్ కోట్ లో నాలుగో రోజు మాత్రం బంతి విపరీతంగా టర్న్ అయ్యిందని తెలిపాడు. ఇలాంటి పరిస్థితులు రవీంద్ర జడేజాకి దొరికితే వదిలిపెట్టడని అన్నాడు. తను అద్భుతంగా బౌలింగ్ చేశాడని అభినందించాడు. జడేజా 5, కులదీప్ 2, అశ్విన్ 1 వికెట్టు పడగొట్టారు. ఇలాంటి పిచ్ లపై ఆడటం మా బలం అని అన్నాడు.

టర్నింగ్ పిచ్ లపై సుడులు తిరుగుతూ వచ్చే బాల్స్ ని, మేం సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నాడు. అందుకు నాలుగో రోజు ఆడిన యశస్వి, సర్ఫరాజ్ ఖాన్ ఆటతీరే ఉదాహరణ అని అన్నాడు.

మరి అదే రోజు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యిందని అన్నాడు. మేం కూడా విదేశాల్లో పేస్ ఎక్కువగా ఉన్న పిచ్ లపై ఆడుతున్నాం కదా అని అన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడే జట్టులోకి వచ్చాడు. ఇంకా ఎంతో నిరూపించుకోవాలి, అప్పుడు అభినందిద్దామని ముగించేశాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×