EPAPER

Simon Doull Prediction on T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్ ఇన్.. గిల్ అవుట్: సైమన్

Simon Doull Prediction on T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్ ఇన్.. గిల్ అవుట్: సైమన్
Simon Doull
Simon Doull

Rohit Kohli, Gill, Out Simon Doull Predicts India’s T20 World Cup: సైమన్ డౌల్.. ఇప్పుడు నెట్టింట…ఆ పేరు వైరల్ అయ్యింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదొక కాంట్రవర్శీ చేయడం, తమని ప్రమోట్ చేసుకోవడం నేడొక ఫ్యాషన్ అయిపోయింది. న్యూజిలాండ్ రేడియో వ్యాఖ్యాత,  కామెంటేటర్, మాజీ ఆటగాడైన సైమన్ డౌల్ ఒక సంచలన ప్రకటన చేశాడు. అదేమిటంటే టీ 20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాలో ఎవరెవరు ఉంటారనేదాని గురించి చెప్పాడు.


అంటే తను ఒక అంచనా వేశాడు. యావద్భారత దేశమంతా ఎవరైతే ప్రధాన ఆటగాళ్లని అనుకుంటున్నారో వారి పేర్లే తను చెప్పాడు. ఇంతకీ వారెవరంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారని., ఇంక శుభ్ మన్ గిల్ ఉండకపోవచ్చని అన్నాడు. విరాట్, రోహిత్ ఉన్నాక గిల్‌కు చోటు దక్కడం కష్టం అని అన్నాడు.

ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌లో తన బెస్ట్ ఛాయిస్ కేఎల్ రాహుల్ అని అన్నాడు. ఎందుకంటే అతను కీపర్ గా, ఇటు బ్యాటర్ గానూ ఉపయోగపడతాడని చెప్పాడు. అతన్ని వదులుకోవడం అంత మంచి నిర్ణయం కాదని తెలిపాడు.


Also Read: శశాంక్ ని ముందు పంజాబ్ వద్దని అనుకుందా?

మరోవైపు ఓపెనర్ గా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ వస్తే, ఫస్ట్ డౌన్ గిల్ వస్తే, సెకండ్ డౌన్ విరాట్ వస్తాడు. ఇది సీక్వెన్స్, కాకపోతే గిల్ ఓపెనర్ గా తప్ప, ఎక్కడా సెట్ కాడని అన్నాడు. అందుకని ఈ టోర్నమెంటులో అతను ఫెయిల్ కావడం ఖాయమని అన్నాడు. తను కంఫర్ట్ గా ఆడే ప్లేస్ లేనప్పుడు జట్టులో ఎంపికచేయడం సరికాదని అన్నాడు.

ఈ విషయంలో న్యూజిలాండ్ ప్లేయర్ సైమన్ వార్తలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. శుభ్ మన్ గిల్ ను ఎందుకు వదంటున్నావు. అతను పంజాబ్ కింగ్స్ పై అద్భుతంగా ఆడాడు. 48 బంతుల్లో 89 పరుగులు చేయడమే కాదు, నాటౌట్ గా ఉన్నాడని అంటున్నారు. ఇది కూడా మరిచిపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే విరాట్ మొదటి రెండు మ్యాచ్ లు అద్భుతంగా ఆడాడు, రోహిత్ కూడా గేర్ మార్చుతాడు. నీకు ఇష్టం లేకపోతే, ప్రపంచానికి ఇష్టం లేనట్టు మాట్లాడటం కరెక్టు కాదని గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×