EPAPER

Rohit Sharma About New York Pitch: న్యూయార్క్ పిచ్.. అలా బతికి బట్టకట్టాం: రోహిత్ శర్మ

Rohit Sharma About New York Pitch: న్యూయార్క్ పిచ్.. అలా బతికి బట్టకట్టాం: రోహిత్ శర్మ

నిజానికి న్యూయార్క్ పిచ్ పై టీమ్ఇండియా ప్లేయర్లు, నాతో సహా పలువురు గాయపడ్డారు. అద్రష్టవశాత్తూ ఎవరరికి బోన్ ఫ్రాక్చర్లు కాలేదు. అందుకే అక్కడ నుంచి బతికి బట్టకట్టామని అన్నాడు. ఏదైనా అంత కఠినమైన పిచ్ పై అమెరికాతో జరిగిన మ్యాచ్ గెలవడం గొప్ప విషయమేనని అన్నాడు.

ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. నిజానికి తన లాంటి సీనియర్లతో ఇలాంటి ఆటే ఆశిస్తుంటామని అన్నాడు. క్రీజులో కుదురుకున్నాక మ్యాచ్ చివరి వరకు ఉండి, గెలిపించడం, ఆ పిచ్ పై సామాన్య విషయం కాదని అన్నాడు. తనకి శివమ్ దుబె సహకరించిన తీరు కూడా ఆకట్టుకుందని అన్నాడు. ఇద్దరు తమ సహజశైలికి భిన్నమైన ఆట ఆడారని అన్నాడు. నిజానికి వారిద్దరి వల్లే విజయం సాధించామని అన్నాడు.


న్యూయార్క్ పిచ్ పై 110 స్కోరు కూడా ఎక్కువేనని అన్నాడు. డాట్ బాల్స్ పడే కొద్దీ బౌలర్ల బలం పెరిగిపోతుంటుందని అన్నాడు. ఈ పరిస్థితుల్లో సూర్యా వికెట్ పడకుండా ఆడాడు. నిజానికి తను చివర్లో అవుట్ అయినా, కొత్త బ్యాటర్ వచ్చి కొంచెం కుదురుకునే ఆడే అవకాశం ఉండదు. రాంగ్ షాట్లు పడుతుంటాయి. ఆ ప్రమాదం లేకుండా వారిద్దరూ ఫినిష్ చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నాడు.

అన్నింటికి మించి బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ ఇంత ఇదిగా రిథమ్ అందుకుంటాడని ఊహించలేదు. ఐపీఎల్ ప్రదర్శనకన్నా వందరెట్లు ఎక్కువ ఇక్కడ కనిపిస్తోందని అన్నాడు. ఒకరకంగా చూస్తే ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉందని అన్నాడు. ఇక నుంచి వెస్టిండీస్ పిచ్ లపై ఆత్మవిశ్వాసంతో ఆడి ముందడుగు వేస్తామని తెలిపాడు.

Related News

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Big Stories

×