EPAPER

 Mumbai Indians : ముంబైకి టీమ్ ఇండియా కెప్టెన్ ఉండాలా?

 Mumbai Indians  :  ముంబైకి టీమ్ ఇండియా కెప్టెన్ ఉండాలా?
 Rohith Sharma

Mumbai Indians : రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇందులో కొత్త పాయింట్ ఒకటి వినిపిస్తోంది. అదేమిటంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎవరదంటే, ముఖేష్ అంబానీ ది అనే సంగతి అందరికీ తెలిసిందే. తన జట్టుకి కెప్టెన్ టీమ్ ఇండియాకి ఎవరైతే ఉన్నారో వారే ఉండాలనే రూల్ ఏమైనా అంబానీ పెట్టుకున్నాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానివల్ల ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని భావిస్తున్నారా? అని అడుగుతున్నారు.


మొత్న బీసీసీఐ అధ్యక్షుడు జైషా కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీపై భరోసా ఇవ్వలేమని చాలా ఓపెన్ గా చెప్పారు. అప్పుడు హార్దిక్ పై ఎనలేని వాత్సల్యాన్ని చూపించారు. తను త్వరగా కోలుకుని రావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు రేపు టీ 20 వరల్డ్ కప్ కి అన్నీ కుదిరితే హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందుకని టీమ్ ఇండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ జట్టుకి ఉండాలనే దుర్భుద్ధితోనే రోహిత్ శర్మని అకారణంగా పక్కన పెట్టారని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి కూడా రోహిత్ శర్మ బయటకు వచ్చేస్తాడని అంటున్నారు.


ఇప్పుడు మరి రోహిత్ శర్మ స్పందన ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ముందు రోహిత్ సౌతాఫ్రికా పర్యటనపై ద్రష్టి పెట్టాడని అంటున్నారు. అక్కడ మళ్లీ సక్సెస్ అయి రావాలని బలంగా కోరుకుంటున్నాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఐపీఎల్ కెప్టెన్సీ పై ఆలోచిస్తాడని అంటున్నారు. అల్లుడు వచ్చేవరకు అమావస్య ఆగదన్నట్టు…రోహిత్ శర్మ వచ్చేవరకు వేలం ఆగదు కదా…ముందే ఏదొకటి తేల్చేసుకుంటే మంచిదని కొందరు చెబుతున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి నాయకత్వ లోపం స్పష్టంగా ఉంది. గతంలో రోహిత్ ఇదే జట్టుతో ఉన్నాడు. ఒకసారి ట్రోఫీ కూడా అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లాడు. పదేళ్లు జట్టుతో పాటు ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. మరిప్పుడు కెప్టెన్ గా మరో జట్టులోకి వెళతాడా? ఇక్కడే ఉంటాడా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×