EPAPER

Rohit Sharma : టీ 20ల్లో.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్..!

Rohit Sharma : టీ 20ల్లో.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్..!
Rohit Sharma

Rohit Sharma : ఆఫ్గాన్ తో జరిగిన తొలి టీ 20లో కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ అయినప్పటికి ప్రపంచ రికార్డ్ సాధించాడు. అదేమిటంటే ఒక క్రికెటర్ గా 100 టీ మ్యాచ్ ల విజయంలో భాగమయ్యాడు. ఇప్పటివరకు  రోహిత్ 149 టీ 20లు ఆడాడు. వాటిలో ఆఫ్గాన్ పై గెలుపుతో 100వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.


అయితే రోహిత్ కెప్టెన్ గా టీమ్ ఇండియా 52 మ్యాచ్ ల్లో… 40 విజయాలు సాధించడం విశేషం. అన్నీ కుదిరి టీ 20 వరల్డ్ కప్ కి నాయకత్వ బాధ్యతలు దొరికితే కెప్టెన్ గా కూడా విజయాల్లో ఆఫ్ సెంచరీ దాటేయవచ్చు.

ఈ టీ 20 రికార్డ్ లో పురుషుల్లోనే నెంబర్ వన్ గా రోహిత్ ఉన్నాడు. అదే మహిళల్లో అయితే రోహిత్ కన్నా ముందు ఒకరున్నారు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ 111 విజయాలతో నెంబర్ వన్ గా ఉంది.


విరాట్ కొహ్లీ తర్వాత పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ 124 మ్యాచ్ ల్లో 86 విజయాలతో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కొహ్లీ 115 మ్యాచ్ ల్లో 73 విజయాలతో ఉన్నాడు. ఇది కాకుండా రోహిత్ శర్మకు వ్యక్తిగతంగా కొన్ని రికార్డులు ఎదురుచూస్తున్నాయి. అవేమిటంటే… రోహిత్ శర్మ ఇప్పటివరకు 51 అంతర్జాతీయ టీ20 మ్యాచులకు సారథ్యం వహించాడు. ఇందులో 39 మ్యాచుల్లో భారత్ గెలుపొందింది. కానీ తనకన్నా ముందు మహేంద్ర సింగ్ ధోనీ 42 విజయాలతో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మగానీ ఆఫ్గాన్ తో జరిగే మూడు టీ 20లు విజయం సాధిస్తే ధోనీ సరసన చేరతాడు.

బాబర్ ఆజమ్ (42) సారథ్యంలో పాకిస్థాన్ జ్టటు 42 టీ 20ల్లో గెలుపొందింది. తర్వాత అష్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్థాన్) కెప్టెన్సీలో , బ్రియాన్ మసాబా సారథ్యంలో ఉగాండ జట్టు, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ కూడా 42 విజయాలు సాధించాయి. రోహిత్ శర్మ మరో 147 పరుగులు చేస్తే టీ 20 క్రికెట్ లో 4వేల పరుగుల మైలు రాయి చేరిన రెండో క్రికెటర్ అవుతాడు. ముందు వరుసలో విరాట్ 4008 పరుగులతో ఉన్నాడు. టీ 20లో మరో 18 సిక్సర్లు కొడితే 200 సిక్సర్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టిస్తాడు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×