EPAPER

Rohit Sharma Records : ఆకాశం నీ హద్దురా.. రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్స్..

Rohit Sharma Records : ఆకాశం నీ హద్దురా.. రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్స్..
Rohit Sharma Records

Rohit Sharma Records : ప్రపంచకప్ లో భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అనితర సాధ్యమైన రికార్డులను అలవోకగా సాధించుకుంటూ వెళ్లిపోతున్నాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సాధించిన రికార్డ్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి..


వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా చివరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్ తో ఆడింది. ఇందులో రోహిత్ శర్మ 61 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్ లు, 8 ఫోర్లు ఉన్నాయి. దీంతో వన్డేల్లో రోహిత్ 55వ ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఓపెనర్ గా 14వేల మైలురాయిని దాటాడు. రోహిత్ కన్నా ముందు వీరేంద్ర సెహ్వాగ్ 16,119.. సచిన్ 15,335 పరుగులతో ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 ఆఫ్ సెంచరీలను రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ స్రష్టించాడు. ఇంతకుముందు గంగూలీ 465 పరుగులు చేయగా, రోహిత్ ఇప్పటికి 503 చేశాడు.


ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్ లు (60) కొట్టిన ఆటగాడిలా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. 2015లో సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కొట్టిన 58 సిక్స్ లను అధిగమించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే 24 సిక్స్ లు కొట్టిన రోహిత్
2019లో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ కొట్టిన 22 సిక్స్ లను అధిగమించాడు.

వరల్డ్ కప్ ల్లో అత్యధికంగా 50 ప్లస్ పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. సచిన్ 44 మ్యాచ్ ల్లో 21 సార్లు, కొహ్లీ 35 ఇన్నింగ్స్ లో 14 సార్లు, రోహిత్ 26 ఇన్నింగ్స్ ల్లో 13 సార్లు సాధించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో వరుసగా 2019, 2023 లో  500 ప్లస్ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్. కాకపోతే సచిన్ 1996 , 2003లో చేశాడు.

 చూశారు కదండీ..సెమీస్ లో ఒక్క సెంచరీ చేశాడంటే ఇంకొన్ని రికార్డులు వచ్చి చేరతాయి. మరో 4 సిక్స్ లు కొడితే నెంబర్ వన్ అయిపోతాడు. మరి ఇండియా కెప్టెన్ కి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×