EPAPER

Ind vs Afg 1st T20 : కెప్టెన్ రోహిత్ భయ్! జరా కూల్.. నెటిజన్లు

Ind vs Afg 1st T20 : కెప్టెన్ రోహిత్ భయ్! జరా కూల్.. నెటిజన్లు
Ind vs Afg 1st T20

Ind vs Afg 1st T20 : ఆఫ్గనిస్తాన్ తో మొహలీలో జరిగిన తొలి టీ 20లో ఒక ఘటన జరిగింది.  ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ వచ్చారు. అయితే ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని రోహిత్ శర్మ మిడాఫ్ దిశగా షాట్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే బాల్ ఫీల్డర్ జడ్రాన్ చేతిలోకి వెళ్లడం చూసి గిల్ ఆగిపోయాడు. అప్పటికే రోహిత్ శర్మ  నాన్ స్ట్రయిక్ ఎండ్ కి వచ్చేశాడు. దీంతో ఈజీగా రన్ అవుట్ అయ్యాడు.


ఈ విషయంలో గిల్ పై తన అసహనాన్ని రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు.‘ బాల్ అక్కడెక్కడో ఉంటే, పరిగెత్తడానికి ఏమైంది?’అంటూ గ్రౌండ్ లోనే సీరియస్ అయ్యాడు. గిల్ ఏదో చెప్పబోయాడు. రోహిత్ అదేమీ పట్టించుకోకుండా… ‘రమ్మని పిలుస్తుంటే వినిపించ లేదా?’అనింకా సీరియస్ అయ్యాడు. దీంతో గిల్ కి కూడా మండింది. ‘ఫీల్డర్ ఉన్నది చూసుకోవా?’అని  ఎదురు తిరిగాడు. దీంతో రోహిత్ మరింత ఆగ్రహానికి గురయ్యి, తిట్టుకుంటూ పెవిలియన్ చేరాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ తీరు కరెక్ట్ కాదని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. గిల్ పరిస్థితి కూడా బాగాలేదు, ఇక్కడ క్లిక్ కాకపోతే, తన ప్లేస్ కి ఎర్త్ వచ్చేలా ఉంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కోసం రన్ అవుట్ అయినా, రేపు తను కాపాడడు కదా.. అని కొందరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ కూడా తనొక కెప్టెన్ అయి ఉండి, గిల్ ని పదిమందిలో అలా నిందించకూడదని అంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్ ఉండేది అందుకే కదా.. అని అంటున్నారు.


అయితే రోహిత్ శర్మకి పలువురు మద్దతు తెలిపారు.  తను ఉన్న పరిస్థితి అటువంటిదని అంటున్నారు. ఎందుకంటే 14 నెలల తర్వాత టీమ్ లోకి వచ్చాడు. అంతేకాదు కెప్టెన్సీ కూడా చాలా స్ట్రగుల్ తో వచ్చింది. ఇప్పుడు చాలా ఒత్తిడి మధ్య ఉన్నాడు. అందుకే టీ 20 వరల్డ్ కప్ కి తను ఉండాలంటే, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. అందుకే అంత నెర్వస్ అయ్యాడని అంటున్నారు. అయితే ఇంకా రెండు టీ 20లు ఉన్నాయి కాబట్టి, రోహిత్ శర్మ అక్కడ నిరూపించుకుంటాడని అంటున్నారు.

ఇకపోతే రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ 2023లో ఒకే ఏడాదిలో  ఓపెనర్స్ గా వచ్చి 22 వన్డేల్లో 1523 పరుగులు చేసి రికార్డ్ స్రష్టించారు. 1999లో ఆసిస్ ఓపెనర్లు గిల్ క్రిస్ట్-మార్క్ వా కలిసి ఒక ఏడాదిలో 1518 పరుగులు చేశారు. అదే ఇప్పటివరకు రికార్డ్ గా ఉంది. దానిని రోహిత్-గిల్ బ్రేక్ చేశారు.

అలాంటి చక్కని పెయిర్ మధ్య ఇలాంటి విభేదాలు మంచివికావని రోహిత్ కి సర్ది చెబుతున్నారు. అంతేకాదు శుభ్ మన్ గిల్ కూడా కరెక్ట్ గా ఉండకుండా…నాకు విరాట్ కొహ్లీ అంటే ఇష్టమని చెప్పాడు. ఒకవైపున రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా, కొహ్లీని మెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఉంటే మనసులో ఉండాలిగానీ బయట పెట్టకూడదని అంటున్నారు.

మొత్తానికి రోహిత్ శర్మతో ఓపెనింగ్ కి గిల్ కి సరిపడటం లేదని కూడా అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ సమయంలో కూడా గిల్ త్వరగా అవుట్ కావడంతో రోహిత్ శర్మ చాలా సీరియస్ గా చూశాడు. అది ఫైనల్ మ్యాచ్ కాబట్టి, ఆ మాత్రం టెన్షన్ ఉంటుందని అంతా సరిపెట్టుకున్నారు.

కానీ ఆఫ్గాన్ మ్యాచ్ లో మాత్రం తను చూపించిన అసంతృప్తి మామూలుగా లేదు. ఇది ఆటలో ఒక భాగమేనని ఎందుకు అనుకోకూడదని అంటున్నారు. తన కెరీర్ లో కూడా ఎంతోమందిని ఇలా అవుట్ చేసి ఉండవచ్చు కదా…రోహిత్ శర్మ ఒకసారి గుర్తు చేసుకోమని అంటున్నారు. అయినా రోహిత్ శర్మకి ఈ మధ్య కోపం ఎక్కువైందని కూడా అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×