EPAPER

Rohit Sharma with Team India: మనవాళ్లకు ఒకటే మాట చెప్పాను.. కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma with Team India: మనవాళ్లకు ఒకటే మాట చెప్పాను..  కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma with Team India Captain: ‘మనకి ఏదైతే జరుగుతుందో.. వారికి అదే జరుగుతుంది.’ ఈ ఒక్క మాటే మన టీమ్ ఇండియా సభ్యులకి చెప్పానని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఎక్కువ పరుగులు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదని తెలిపానని అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టు సభ్యులతో మాట్లాడిన విషయాలను షేర్ చేసుకున్నాడు.


జట్టు కోసం ప్రతీ ఒక్కరు ఎంత చేయగలరో అంతా చేయండి. సమష్టిగా అందరం కృషి చేస్తే.. గెలుపు మనదేనని తెలిపానని అన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా తన బలాలను నమ్ముకొని బౌలింగ్ చేశాడు. నిజానికి ఈ క్రెడిట్ బుమ్రాకే దక్కుతుందని అన్నాడు. తనవల్లనే మ్యాచ్ గెలిచామని అన్నాడు.

తను బ్రేక్ ఇచ్చి ఉండకపోతే, పాక్ పరిస్థితి మరొకలా ఉండేదని, వారిని నిలువరించడం సాధ్యమయ్యేది కాదని అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే, ముందు మ్యాచ్ ల మీద పిచ్ చాలా బాగుంది. కాకపోతే మా ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేదు. దాంతో మా లక్ష్యానికి కొన్ని పరుగులు తక్కువగా చేశామని అన్నాడు.


Also Read : అట్లుంటది.. మనోడితోని..! : గేమ్ ఛేంజర్ అతడే!

అయినా ఈ పిచ్‌పై మాకైనా, వారికైనా ప్రతీ పరుగు ముఖ్యమే, మంచి బౌలింగ్ లైనప్ తో బాల్స్ వేస్తే, వికెట్లు వస్తాయనుకున్నాం. అది బుమ్రా చేశాడు. అయితే మొదట్లో అర్షదీప్ తడబడినా, తర్వాత సర్దుకున్నాడని తెలిపాడు.

సిరాజ్ పొదుపుగా బౌలింగు చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కి.. ఈ పిచ్ కరెక్టుగా సరిపోతుంది. అందుకే మిడిల్ ఆర్డర్ లో వికెట్లను నేలకూల్చాడని తెలిపాడు. ఇకపోతే బుమ్రా జీనియస్ అని తెలిపాడు. తన బౌలింగులో ఎప్పుడూ ఎవరం వేలు పెట్టమని తెలిపాడు. తనకి పూర్తి స్వేచ్ఛనిచ్చామని అన్నాడు.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్.. టీమ్ ఇండియాలో ఒకే ఒక్కడు

ఇక టీమ్ ఇండియా ఏ దేశంలో ఆడిన అక్కడ భారతీయులు భారీ సంఖ్యలో హాజరవ్వడం సంతోషంగా ఉందని అన్నాడు. మేం ఎక్కడ ఆడినా అభిమానులు మద్దతు తెలుపుతూనే ఉంటారు. ఏనాడు వారు మమ్మల్ని నిరుత్సాహపరచలేదని అన్నాడు. ఇది మా అదృష్టమని తెలిపాడు. అందుకే ఆ అభిమానులను నిరాశ పరచకూడదని మేం వందకు రెండు వందల శాతం కష్టపడతామని అన్నాడు.

Tags

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

×