EPAPER

Rohit Sharma CEAT Award: రోహిత్ శర్మకు ‘ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. మరి విరాట్ కోహ్లీకి?..

Rohit Sharma CEAT Award: రోహిత్ శర్మకు ‘ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. మరి విరాట్ కోహ్లీకి?..

Rohit Sharma CEAT Award| వన్డే క్రికెట్ ఇండియన్ కెప్టెన్ రోహిత శర్మకు సియెట్ మెన్స్ ‘ఇంటర్నేష్నల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. బుధవారం, ఆగస్టు 21 రాత్రి ముంబై లో సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టి20 ప్రపంచ కప్ 2024 ని గెలుచుకున్న టీమిండియాకు సారధ్యం వహించినందుకు .. అతనికి ఈ అవార్డ్ లభించింది.


రోహిత్ తన వన్డే, టి20 కెరీర్ లో సంయుక్తంగా 14,846 రన్స్, మూడు డబుల్ సెంచరీలు, 33 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు సాధించాడు. వీటితో పాటు రోహిత్ శర్మ్ కెప్టెన్సీలో రెండు సార్లు ఐసిసి టి20 ప్రపంచ కప్ (2007, 2024), ఒకసారి ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ అయిన టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. టి20 ఫార్మాట్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన రికార్డ్ కూడా రోహిత్ పేరునే ఉంది. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ధోని చేతుల నుంచి తీసుకున్న రోహిత్ శర్మ.. మొత్తం 62 టి20 మ్యాచ్ లలో 49 మ్యాచ్ లలో విజయం సాధించాడు. మరోవైపు ధోనీ తన కెరీర్ లో 72 మ్యాచ్ లు ఆడి 41 మ్యాచ్‌లలో విజయం సాధించాడు.

రోహిత్ శర్మ తో పాటు ఇతర భారత క్రికెటర్లకు కూడా అవార్డ్స్ లభించాయి. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఉత్తమ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో 9 ఇన్నింగ్స్ లలో 712 రన్స్, స్ట్రైక్ రేట్ 79.91 గా ఉంది.


ఆ తరువాత భారత పేస్ బౌలర్ మొహమ్మదర్ షమీ కి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో అత్యధికంగా వికెట్లు తీసినందుకు ఈ అవార్డు లభించింది. ప్రపంచ కప్ టోర్నమెంట్ లోని కేవలం 7 మ్యాచ్ లలో షమీ.. 5.26 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 33 ఏళ్ల షమీ తన వన్డే కెరీర్ లో 101 మ్యాచ్ లలో 195 వికెట్లు పడగొట్టాడు.

ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే.. అతనికి వన్డ్ బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ అత్యధికంగా పరుగులు సాధించాడు. కేవలం 11 మ్యాచ్ లలో 90.31 స్ట్రైక్ రేట్ తో 765 రన్స్ సాధించాడు.

రవిచంద్రన్ అశ్విన్ కు సియెట్ మెన్స్ ‘టెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ ‘ అవార్డు లభించింది. ఇంగ్లండ్ టూర్ లో అశ్విన్ అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు. కేవలం 5 మ్యాచ్ లలో 26 వికెట్లు పడగొట్టాడు.

Also Read: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఎంత లాభం వస్తుంది?

మరోవైపు మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కు సియెట్ ‘లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’ లభించింది. జూలై 2024లో టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకున్న తరువాత ద్రవిడ్ పదవీకాలం పూర్తి అయింది.

Also Read: ఐసీసీ పీఠంపై మనోడేనా?: జైషా ఎన్నిక లాంఛమేనా?

 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×