EPAPER

Rohit Sharma Six: అరేయ్ బాబూ.. అది 152 కిమీ స్పీడ్ తో వస్తోంది.. రోహిత్ సిక్సర్ కి నెటిజన్ల ఫిదా

Rohit Sharma Six: అరేయ్ బాబూ.. అది 152 కిమీ స్పీడ్ తో వస్తోంది.. రోహిత్ సిక్సర్ కి నెటిజన్ల ఫిదా

 


rohit sharma latest update

IND vs ENG 2024, 5TH Test Rohit Sharma Six(Latest sports news telugu): ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ కొట్టిన ట్రేడ్ మార్క్ సిక్సర్ నెట్టింట వైరల్ అయ్యింది. అందరూ రోహిత్  శర్మ… సిక్సర్ కు ఫిదా అవుతున్నారు. ఎందుకంతగా ఆకాశానికెత్తేస్తున్నారు…తనెప్పుడూ కొడుతూనే ఉంటాడు గా…అని కొందరు కామెంటు చేస్తున్నారు.


అందుకు బదులుగా రోహిత్ అభిమానులు చెప్పే మాటేమిటంటే…
‘అరేయ్ బాబూ.. అది మామూలు బాల్ కాదు 152 కిమీ వేగంతో వచ్చింది. దాన్ని లిఫ్ట్ చేయడమంటే మాటలు కాదు.. ఏ మాత్రం తేడా పాడా వచ్చినా ముఖం పచ్చడైపోతుంది.’ అని చెబుతున్నారు.

నిజానికి దాని వేగాన్ని గమనించి, అంతే వేగంతో, అదే టైమింగ్ తో  ఫ్యాక్టర్ ఆఫ్ సెకన్స్ లో బాల్ ని కొట్టాలి. ఏ మాత్రం రాంగ్ షాట్ పడినా, క్యాచ్ అవుట్ అవుతామని సీనియర్లు అంటున్నారు.

Read more: గవాస్కర్ రికార్డ్ కి 62 పరుగుల దూరంలో యశస్వి

విషయానికి వస్తే ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా డాషింగ్ అండ్ డేరింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.

మార్క్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ ఈ భారీ సిక్సర్ కొట్టాడు. 152 కిలోమీటర్ల వేగంతో షాట్ పిచ్ బాల్‌గా సంధించగా.. రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్‌తో ఫైన్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ప్రస్తుతం ఈ  సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

రోహిత్  కొట్టిన షాట్ చూసిన మార్క్ వుడ్ సైతం బిత్తరపోయాడు. ఇతనేంట్రా బాబూ… 152 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని కూడా అలా కొట్టేశాడని కాసేపు  ఆశ్చర్యపోయాడు. సమకాలీన క్రికెట్ లో పుల్‌షాట్ కొట్టడంలో రోహిత్ శర్మను మించిన వాడు లేడని నెటిజన్లు వాక్యానిస్తున్నారు. అంతేకాదు తన కెరీర్ మొత్తమ్మీద  అత్యుత్తమ సిక్సర్‌ ఇదేనని తేల్చి చెబుతున్నారు.

రోహిత్ శర్మ ఆట చూస్తేనే కనువిందుగా ఉంటుందని, బోర్ కొట్టదని, నిజానికి డిఫెన్స్ ఆడటం రోహిత్ కే నచ్చదని అభిమానులు అంటున్నారు. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ సైతం రోహిత్ శర్మ పుల్ షాట్‌కు ఫిదా అయ్యాడు. తనే నా హీరో అని పేర్కొన్నాడు.

Tags

Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×