EPAPER
Kirrak Couples Episode 1

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant mocking Ravichandra Ashwin for DRS caught in Stump mic: కాన్పూర్ టెస్టు నేపథ్యంలో ఫ్యాన్స్‌ కు నిరాశే ఎదురైంది. కాన్పూర్ టెస్టులో తొలిరోజు వరుణుడు ఆధిపత్యాన్ని చలాయించాడు. మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో దాదాపు ఒక గంట సేపు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే లంచ్ బ్రేక్ అనంతరం మ్యాచ్ మొదలైందో లేదో వర్షం మళ్లీ కురిసింది. అనంతరం వర్షం అసలు తగ్గలేదు. దీంతో తొలిరోజు ఆట ముగిసిందని అంపైర్లు ప్రకటించారు. మొదటి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే ఆడారు. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది.


 

ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10:30 గంటలకు మొదలైంది. ఇన్నింగ్స్ ను బంగ్లా జట్టు స్లోగా ఆరంభించింది. పర్యాటక జట్టు యువ బౌలర్ ఆకాష్ దీప్ షాక్స్ మీద షాక్స్ ఇచ్చాడు. జకీర్ హసన్ ఆట ఆరంభించక ముందే పెవిలియన్ కు పంపించాడు. దీంతో 26 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికి ఇస్లామ్ ను ఆకాష్ దీప్ బుక్ చేశాడు. ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు. ఇస్లామ్ 24 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నజ్ముల్ మోమినుల్ హక్ కూల్ గా ఆడేందుకు ప్రయత్నించారు. భారత బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నారు.


Also Read: Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

దీంతో లంచ్ బ్రేక్ కు బంగ్లాదేశ్ రెండు వికెట్లను 74 పరుగులు సాధించింది. ఈ దశలోనే వర్షం ప్రారంభమైంది. గ్రౌండ్ సిబ్బంది కవర్లతో పిచ్ ను కవర్ చేశారు. రెండో సెషన్ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అశ్విన్ తన ఫామ్ ను కొనసాగించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటోను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత మళ్లీ వర్షం ప్రారంభమైంది. మ్యాచ్ ను కొనసాగించే ప్రయత్నాలు లేకపోవడంతో తొలిరోజు ఆటను అంపైర్లు ముగించారు. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటోను అశ్విన్ ఎల్బిగా అవుట్ చేశాడు.

Also Read:  Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

57 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతనిని అశ్విన్ బోల్తా కొట్టించిన విధానంపై టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ప్రశంసిస్తున్నారు. షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన షాంటో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎల్బీగా అవుట్ అయ్యారు. దీనిపై కార్తీక్ మాట్లాడుతూ…. తన బౌలింగ్ లో పరుగులు రాబట్టాడని…. షాంటో ఉన్నాడనే విషయం అశ్విన్ కు అర్థమైందని…. దీంతో స్వీప్ లేదా డిఫెన్స్ మాత్రమే ఆడేలా అశ్విన్ బంతులను అందించాడన్నారు. ఆఫ్ స్పిన్ కు బదులు వికెట్లను లక్ష్యంగా బంతులను వేయడంలో షాంటో దొరికిపోయాడని తెలియజేశాడు. కాగా.. శాంటోను ఔట్‌ చేయడానికి పంత్‌, అశ్విన్‌ ముందే ఈ స్కెచ్‌ వేసుకున్నారట. ఇది ఇలా ఉండగా, రెండో రోజు మ్యాచ్‌ కు కూడా వర్షం అడ్డంగిగా మారనుంది.

 

Related News

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

Shikhar Dhawan: శిఖర్ ధవన్ కు వాళ్ల టార్చర్..అందుకే రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్!

Big Stories

×