EPAPER

Rinku Singh hostel : క్రికెటర్ కాదు.. హీరో. పేద క్రికెటర్ల కోసం ‘రింకూ’ హాస్టల్‌

Rinku Singh hostel : క్రికెటర్ కాదు.. హీరో. పేద క్రికెటర్ల కోసం ‘రింకూ’ హాస్టల్‌
Rinku Singh hostel

Rinku Singh hostel : రింకూ సింగ్.. ఓవర్‌నైట్ హీరో అయిన క్రికెటర్. ఇప్పుడు నిజంగానే హీరో అనిపించుకుంటున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నాడు. తనలా పేదరికం కారణంగా కష్టాలు పడొద్దన్న ఉద్దేశంతో.. పేద క్రికెటర్లకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ సింగ్ అలాంటి వారి కోసం ఓ హాస్టల్ కడుతున్నాడు.


మొన్నటి మ్యాచ్‌లో వరుస సిక్సులు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడనుకుంటే పొరపాటే. మూడు నెలల కింద హాస్టల్ పనులు మొదలుపెట్టించాడు. మరో నెల రోజుల్లో హాస్టల్‌  నిర్మాణం పూర్తవుతుంది. ఐపీఎల్‌ పూర్తయ్యాక రింకూ సింగ్‌ ఈ హాస్టల్‌ను ప్రారంభించనున్నాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రింకూ…2017 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2017లో పంజాబ్‌ జట్టు రింకూ సింగ్‌ను తీసుకుంది. 2018లో కోల్‌కతా టీమ్ రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రింకూ సింగ్‌ను 2022లో జరిగిన మెగావేలంలో మరోసారి కేకేఆర్‌ రూ.55 లక్షలకు రిటైన్‌ చేసుకుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్‌ 425 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 58.


పేదరికం నుంచి వచ్చిన రింకూ సింగ్.. ఇప్పుడు ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాడు. అందుకే, 50 లక్షలు ఖర్చు పెట్టి పేద క్రికెటర్ల కోసం హాస్టల్ కట్టిస్తున్నాడు. తనలాగే కలలు సాకారం చేసుకోవాలనుకుంటున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలీగఢ్‌కు చెందిన రింకూ చిన్నప్పటి కోచ్‌ జాఫర్‌.. 15 ఎకరాల స్థలంలో అలీగఢ్‌ క్రికెట్‌ స్కూల్‌, అకాడమీ నడిపిస్తున్నాడు. ఈ స్థలంలోనే హాస్టల్‌ నిర్మాణం జరుగుతోంది.

హాస్టల్‌లో మొత్తం 14 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీలు ఉండొచ్చు. ఇక్కడే ఉన్న క్యాంటీన్‌లో వాళ్లు ఆహారం తినొచ్చని చెబుతున్నారు. 

Related News

KCR: గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. కేసీఆర్ నిజంగానే కనబడుటలేదా?

KTR on Hydra: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

×