EPAPER
Kirrak Couples Episode 1

Rinku Singh : మ్యాచ్ నిలబెట్టిన రింకూ సింగ్.. 92పరుగులతో సెంచరీ మిస్..

Rinku Singh : దేశవాళి క్రికెట్ లో ఉత్తర ప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూసింగ్ విధ్వంసం సృష్టించి మ్యాచ్  చేజారిపోకుండా నిలబెట్టాడు. దేశంలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ లో భాగంగా ఎలైట్ గ్రూప్ బీలో కేరళతో జరిగిన మ్యాచ్ లో రింకూ సింగ్ 92 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.

Rinku Singh : మ్యాచ్ నిలబెట్టిన రింకూ సింగ్.. 92పరుగులతో సెంచరీ మిస్..

Rinku Singh : దేశవాళి క్రికెట్ లో ఉత్తర ప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూసింగ్ విధ్వంసం సృష్టించి మ్యాచ్  చేజారిపోకుండా నిలబెట్టాడు. దేశంలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ లో భాగంగా ఎలైట్ గ్రూప్ బీలో కేరళతో జరిగిన మ్యాచ్ లో రింకూ సింగ్ 92 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.


124 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ యూపీనీ తనదైన శైలిలో ఆదుకున్నాడు. మరో ఎండ్ లో  ధృవ్ జురెల్ (63) సాయంతో స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. ఆరో వికెట్‌కు 143 పరుగులు జోడించాడు. అలా 136 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.

తను టీ 20, వన్డేలు మాత్రమే కాదు, టెస్ట్ క్రికెట్ కూడా ఆడగలను, ఆ సామర్థ్యం కూడా ఉందని టీమ్ ఇండియా సెలక్టర్లకు పరోక్షంగా తెలిపాడు. అయితే సెంచరీ మిస్ చేసుకున్నా ఉత్తరప్రదేశ్‌ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.


యూపీ తొలి ఇన్నింగ్స్ లో 83.4 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రింకూసింగ్ తాజాగా టీ 20 మ్యాచ్ ల్లో ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతున్నాడు. బెస్ట్ ఫినిషర్ రోల్ కి అతికినట్టు సరిపోతున్నాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా రింకూ సింగ్ కి చోటు దొరికితే సీనియర్లు త్వరగా అవుట్ అయినా, తను ఆదుకుంటాడని అంటున్నారు.

ఐపీఎల్ లో ధోనీ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ కి చిన్న ఝలక్ తగిలింది. ధోనీ మార్గదర్శకత్వంలో క్రీడాకారులని కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ యూపీ ప్లేయర్ సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే తను కేవలం 26 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే ధోనీ ఏం చూసి తనని తీసుకున్నాడో తెలీదు. ఐపీఎల్ లో అతని ప్రతిభను చూడవచ్చునని కొందరు అంటున్నారు. రింకూసింగ్ కూడా తన శిష్యుడే కదా అని గుర్తు చేస్తున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కేరళ 34 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో సచిన్ బేబీ‌తో పాటు విష్ణు వినోద్ ఉన్నారు.

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×