EPAPER

T20 World Cup 2024: అమెరికాలో క్రికెట్ కి ఆదరణ పెరగాలంటే.. ఇండియా-పాక్ మ్యాచ్ తోనే సాధ్యం: రికీ పాంటింగ్

T20 World Cup 2024: అమెరికాలో క్రికెట్ కి ఆదరణ పెరగాలంటే.. ఇండియా-పాక్ మ్యాచ్ తోనే సాధ్యం: రికీ పాంటింగ్

T20 World Cup 2024 updatesT20 World Cup 2024(Sports news in telugu): టీ 20 ప్రపంచకప్ జూన్ లో ప్రారంభం కానుంది. ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్లందరూ కొన్ని బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అలా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా సరికొత్త పాత్రలోకి వెళ్లాడు. అదేమిటంటే అమెరికాలో క్రికెట్ కి ప్రాచుర్యం కల్పించనున్నాడు. ఆర్థికంగా బలోపేతంగా ఉన్న అమెరికా లాంటి దేశంలో క్రికెట్ కు ఆదరణ పెంచగలిగితే క్రికెట్ ఏ పది దేశాలకో పరిమితం కాదని, విశ్వవాప్తం అవుతుందని అంటున్నాడు.


న్యూయార్క్ లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇండియా-పాక్ మధ్య జరిగే మ్యాచ్ ఒక వేదిక అవుతుందని భావిస్తున్నాడు. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఒక టెన్షన్ నడుస్తూనే ఉంటుందని అంటున్నాడు.

వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జూన్ 9న జరగనుంది. అయితే 2022 టీ 20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు మెల్‌బోర్న్‌లో తలపడ్డాయి. అప్పుడు కూడా ఉత్కంఠభరితంగానే సాగిందని అన్నాడు.


Also Read: Shreyas Iyer: శ్రేయాస్‌కు ఊపిరి.. కాంట్రాక్టు విషయంలో బీసీసీఐ పునరాలోచన..?

అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రచారంలో భాగంగా రికీ పాంటింగ్ నిమగ్నమై ఉన్నాడు. ఇక్కడ క్రికెట్‌ను అభివృద్ధి చేయాలి, ప్రోత్సహించాలి, ఇవి రెండూ ఛాలెంజ్ లాంటివేనని అన్నాడు. అయితే ఇది నాకు దొరికిన ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు ఇక్కడ వాషింగ్టన్ ఫ్రీడమ్‌ క్రికెట్ లీగ్ ప్రచారంలో బాధ్యత తీసుకున్నట్టు తెలిపాడు.

ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి అమెరికా వచ్చిన వాళ్లున్నారు. వారిలో ప్రవాస భారతీయులు, వెస్ట్ ఇండియన్లు, పాకిస్థానీలు, శ్రీలంక, ఆఫ్ఘన్‌లు చాలామంది ఉన్నారని అన్నాడు. వాళ్లందరికీ క్రికెట్ అంటే ఇష్టం.. వారే క్రికెట్ ని అమెరికాలో ప్రచారం చేస్తారని తెలిపాడు. క్రికెట్‌ను ప్రేమించేలా, అర్థం చేసుకునేలా అమెరికన్లను ప్రేరేపించాల్సి ఉంటుందని అన్నాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×