EPAPER

Record Partnership In ODI History : వన్డే చరిత్రలో రికార్డ్ పార్టనర్‌షిప్..

Record Partnership In ODI History : వన్డే చరిత్రలో రికార్డ్ పార్టనర్‌షిప్..

Record Partnership In ODI History : వన్డే చరిత్రలో ఇలా 7 వికెట్ పైన వచ్చి, 202 పరుగుల భాగస్వామ్యంతో విజయం సాధించిన ఆస్ట్రేలియా నయా రికార్డ్ లిఖించింది. ఈ మ్యాచ్ చూడటానికి, చెప్పడానికి కూడా మాటలు చాలవని క్రీడా పండితులు అంటున్నారు. మాక్స్ వెల్ ఆడిన తీరు ఎంత చెప్పినా తక్కువనేనని చెబుతున్నారు.


భవిష్యత్తులో ఎంతో మంది క్రీడాకారులు రావచ్చు, కొత్త రికార్డులు సృష్టించవచ్చు, పాతవి కాలగర్భంలో కలిసిపోతూ ఉండవచ్చు. రేపు అన్నరోజున మాక్స్ వెల్ రికార్డ్ ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ టాప్ టెన్ అత్యుత్తమ భాగస్వామ్యాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే మాక్స్ వెల్ జీవితంలో మరపురాని మ్యాచ్. అంతేకాదు బాల్ టు బాల్ చూసినవారికి, స్టేడియంలో ఉన్నవారికి, మాక్స్ వెల్ తో ఆడినవారు, తన కెప్టెన్ కమిన్స్ కి అందరికీ మరపురాని మధురానుభూతులను పంచుతుంది. అంత విలువైన స్కోర్ చేసి జట్టును సెమీస్ కి చేర్చిన మాక్స్ వెల్ నయా క్రికెట్ కి సరికొత్త నిర్వచనంగా నిలిచాడు.


వీరి తర్వాత 7 వికెట్ భాగస్వామ్యంలో అత్యధిక పరుగులు చేసిన వారు ఇంగ్లండ్ జట్టు జాస్ బట్లర్, ఆదిల్ రషీద్ జంట. వీరిద్దరూ 2015లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 177 పరుగులు చేయడం విశేషం. కానీ ఇక్కడ మాక్సెవెల్-కమిన్స్ జంట ఛేజింగ్ లో సాధించారు. అదీ గొప్ప విషయం. అందుకే చరిత్రాత్మకమైంది.

మూడో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లా జంట ఆఫిఫ్ హుస్సేన్, మెహదీ హసన్ ఇద్దరూ కలిసి 174 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఇండియా మాత్రం 11 స్థానంలో ఉంది. ఎంఎస్ ధోనీ, అశ్విన్ కలిసి 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. 2012లో చెన్నైలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 7వికెట్ కి ఇండియా తరఫున రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు.

తర్వాత 18వ స్థానంలో 116 పరుగులతో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా నిలిచారు. మాంచెస్టర్ లో న్యూజిలాండ్ తో జరిగిన  2019 వరల్డ్ కప్ సెమీస్ లో  చేశారు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంక చివర్లో 2004లో ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో హేమంగ్ బదాని, అగార్కర్ కలిసి 102 పరుగులు చేశారు. 1996లో కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సౌరభ్ గంగూలీ-సునీల్ జోషి కలిసి 100 పరుగులు చేశారు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×