EPAPER

Georgia Wareham Fielding: వారెవ్వా సూపర్ ఫీల్డింగ్.. ఆర్సీబీకి లేడీ డీవిలియర్స్ దొరికినట్టే..

Georgia Wareham Fielding: వారెవ్వా సూపర్ ఫీల్డింగ్.. ఆర్సీబీకి  లేడీ డీవిలియర్స్ దొరికినట్టే..

Georgia Wareham FieldingGeorgia Wareham Fielding RCB vs DC:ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ జార్జియా వేర్‌హామ్ అద్భుత ఫీల్డింగ్ చేసి ఏబీ డివిలియర్స్‌ను గుర్తు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.


ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర స్ప్రింగ్ లా ఎగిరి గాల్లోనే సిక్సర్‌ను అడ్డుకుంది. ఆమె సూపర్ ఫీల్డింగ్‌ను చూసి గ్రౌండ్ లో ఉన్నందరూ బిత్తరపోయారు. మ్యాచ్ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

నడిన్ డి క్లర్క్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని షెఫాలీ వర్మ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్‌ కొట్టింది. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వేర్‌హామ్ గాల్లోకి అమాంతం ఎగిరి ఎడమ చేతితో బంతిని పట్టి లోపలికి విసిరేసింది. దాంతో సిక్సర్ కాస్త టూడీ అయ్యింది. వారెవ్వా ఫీల్డింగ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Read More: ఆటగాళ్లపై పనిభారం.. బీసీసీఐ పట్టించుకోవడం లేదా?

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో నడిన్ డి క్లర్క్ 2, సోఫీ డివైన్ 2, శ్రేయాంక పాటిల్ ఒక వికెట్ పడగొట్టింది.

అనారోగ్యం కారణంగా ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ ఈ మ్యాచ్‌కు దూరమైందని కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×