EPAPER

Ravindra Jadeja’s Wife Rivaba: రవీంద్ర జడేజా తండ్రి ఆరోపణలపై రివాబా స్పందన.. కామెంట్స్ వైరల్!

Ravindra Jadeja’s Wife Rivaba: రవీంద్ర జడేజా తండ్రి ఆరోపణలపై రివాబా స్పందన.. కామెంట్స్ వైరల్!
Ravindra Jadeja's Wife Rivaba comments

Rivaba Comments on Ravindra Jadeja’s Father: క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో వివాదం మరింత ముదిరింది. ఇటీవల జడేజా తండ్రి అనిరుధ్ సింగ్.. కొడుకు, కోడలు రివాబాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ వార్ హాట్ టాపిక్ గా మారింది.


టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె చుట్టూనే ఆ ఫ్యామిలీలో వార్ నడుస్తోంది. రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా ఇటీవల తను కుటుంబానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. కోడలు, కొడుకుతో కలిసి జీవించడం లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకే నగరంలో ఉంటున్నా.. వేర్వేరుగా నివస్తున్నామని తెలిపారు. తన మనవరాలు కలుసుకునే అవకాశం కూడా కొడుకు, కోడలు ఇవ్వలేదని ఆరోపించారు.

ఈ వివాదాస్పద ఇంటర్వ్యూలో జడేజా తండ్రి అనిరుధ్ జడేజా రివాబాపై పలు ఆరోపణలు చేశారు. 2016లో తన కుమారుడితో వివాహం జరిగిన రెండు మూడు నెలల్లోనే కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని తెలిపారు. కోడలు, కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర తన ప్రత్యేక బంగ్లాలో నివసిస్తున్నాడని పేర్కొన్నారు. తాను ఇంకో ఇంట్లో నివసిస్తున్నానని తెలిపారు. తాము వారిని పిలవమని, వారు తమని పిలవరని వెల్లడించారు. రివాబా ఎప్పుడూ తమ కుటుంబంతో కలిసి జీవించాలని కోరుకోలేదని ఆరోపించారు. ఆమెకు స్వేచ్ఛ కావాలన్నారు. తాను, నయన్‌బా (జడేజా సోదరి) తప్పు చేసినా తమ కుటుంబంలోని మిగిలి 50 మంది తప్పేంటి? అని ప్రశ్నించారు. రవీంద్రకు కుటుంబంలో ఎవరితోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. అనిరుధ్ సింగ్ జడేజా ఇంటర్వ్యూతో ఆ కుటుంబంలోని వివాదాలు రచ్చకెక్కాయి.


Read More: KS Bharat: వికెట్ కీపర్ భరత్‌కి స్థాన చలనమా?

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబాకు అనిరుధ్ సింగ్ జడేజా వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరారు. దీని రివాబా స్పందించారు. కుటుంబ సమస్యలపై ప్రశ్నలు అడగడానికి తనతో విడిగా మాట్లాడవచ్చని స్పష్టంచేశారు. బహిరంగంగా అలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం తన కుటుంబ జీవితంపై చర్చించడం కాదన్నారు. ఈ ప్రశ్నలను చర్చించడానికి వ్యక్తిగతంగా తన నుంచి సమయం తీసుకోవచ్చని విలేకరితో అన్నారు. రివాబా స్పందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రివాబా గుజరాతీలో సమాధానమిచ్చారు.

ఇటీవల తండ్రి ఇంటర్వ్యూ వెలుగులోకి వచ్చినప్పుడు రవీంద్ర జడేజా స్పందించాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రాశాడు. ఈ ఇంటర్వ్యూ స్క్రిప్ట్‌తో రూపొందించారని పేర్కొన్నారు. దాని ఎవరూ విశ్వసించవద్దని సూచించాడు. ఆ ఇంటర్వ్యూ ఉద్దేశ్యం తనతోపాటు తన భార్య ప్రతిష్టను దిగజార్చడమేనన్నాడు. జడేజా భార్య రివాబా గుజరాత్ అసెంబ్లీలోని జామ్‌నగర్ నార్త్ ఎమ్మెల్యే గా ఉన్నారు. బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఈ స్థానంలో గెలుపొందారు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×