EPAPER

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు అవుట్..!

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు అవుట్..!

Ravindra Jadeja and two More India stars Ruled out of Duleep Trophy 2024: జాతీయ జట్టుకి ఎంపికైన క్రికెటర్లందరూ.. దేశవాళీ క్రికెట్ లో ఆడటం లేదనే విమర్శలున్నాయి. ఆడకపోతే పోయారు.. పోనీ ప్రాక్టీస్ అయినా చేస్తున్నారంటే అదీ లేదని అంటున్నారు. సరాసరి అంతర్జాతీయ సిరీస్ లకి ముందు జరిగే ట్రైనింగ్ క్యాంపులకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు.


దీంతో సరాసరి మ్యాచ్ లకి వెళ్లి, అవుట్ అయి వచ్చేస్తున్నారు. అందుకనే వీరందరినీ కూడా దులీప్ ట్రోఫీ ఆడాలని కొత్త కోచ్ గౌతం గంభీర్ చెప్పడంతో జాతీయ జట్టు మూడు ఫార్మాట్లలో ఆడే వారందరూ ఇక్కడ ఆడుతున్నారు.

ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీకి ఎంపికైన స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ‘ఇండియా-బీ’ జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో నవదీప్ సైనీ చేరనున్నాడని తెలిపింది. మ్యాచ్ కి ముందు అనారోగ్యం పాలు కావడంతో తనని తప్పించారు. సిరాజ్ తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా అందుబాటులో ఉండటం లేదు. తన స్థానంలో ‘ఇండియా-సీ ‘ జట్టులో గౌరవ్ యాదవ్ ఎంపికైనట్టు బీసీసీఐ తెలిపింది.

ఇకపోతే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా దులీప్ ట్రోఫీ ఆడటం లేదని తెలిపింది. తన స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.
ఇండియా బీలో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఆడతాడని బీసీసీఐ వివరించింది.
సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ మ్యాచ్ లకి ముందు ఇంకెంత మంది రిటైర్డ్ హార్ట్ అవుతారో తెలీడం లేదని అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి.  మొదటి రౌండ్‌ తర్వాత రెండో రౌండుకి వెళ్లే జట్లలో కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా ఏ: శుభ‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, తనుష్ కొటియన్, ఆకాష్ దీప్, విద్వాత్ కావెరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

ఇండియా బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ముషీర్ ఖాన్, నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్.

ఇండియా సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, అభిషేక్ పోరెల్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్.

ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, రికీ భుయ్, యశ్ దూబె, తుషార్ దేశ్‌పాండే, సరాన్ష్ జైన్, అథర్వ, ఆదిత్య, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా,  సౌరభ్ కుమార్.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×