EPAPER

Ravichandran Ashwin : అశ్విన్ వచ్చేస్తున్నాడు: బీసీసీఐ

Ravichandran Ashwin : అశ్విన్ వచ్చేస్తున్నాడు: బీసీసీఐ
Ravichandran Ashwin latest news

Ashwin To Rejoin Indian Team In Rajkot(Live sports news): హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో అత్యవసరంగా చెన్నై వెళ్లిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులోకి రానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. కుటుంబంలో అత్యవసర పరిస్థితి వచ్చింది. తిరిగి తను జట్టులో కలవనున్నాడని చెప్పేందుకు సంతోషిస్తున్నామని తెలిపింది.


మ్యాచ్ రెండోరోజు మాతృమూర్తికి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా జట్టు నుంచి అశ్విన్ వీడాడు. అతడి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు, మీడియా, అభిమానులు అందరూ అతనికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సహకరించిన అందరికీ బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. అందరి మద్దతుతో మళ్లీ తను మైదానంలోకి అడుగుపెట్టనున్నాడని, జట్టు మేనేజ్మెంట్ అతనికి స్వాగతం పలుకుతోందని తెలిపింది.

ఇప్పుడు అశ్విన్ రాక టీమ్ ఇండియాకి అనివార్యంగా మారింది. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో నలుగురి బౌలర్లతోనే రోహిత్ శర్మ నడిపించాడు. అయితే సిరాజ్ క్లిక్ కావడంతో బతికి బట్టకట్టారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా పటిష్ట స్థితికి చేరుతోంది.


Read more: యశస్వీ భవ :వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్ గా రికార్డ్

దురద్రష్టవశాత్తూ గిల్ 91 పరుగుల వద్ద రనౌట్ అయి వెనుతిరిగాడు. దీంతో మూడో రోజు సెంచరీ తర్వాత రిటైర్డ్ హార్ట్ అయి వెనుతిరిగిన యశస్వి జైశ్వాల్ తిరిగి క్రీజులోకి వచ్చి అదరగొడుతున్నాడు. అద్భుతంగా స్టాండింగ్ ఇచ్చిన కులదీప్ 91 బాల్స్ ఆడి 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అందులో ఒక సిక్స్, 2 ఫోర్లు కూడా ఉన్నాయి.

అయితే యశస్వి జైశ్వాల్ ఎప్పటిలా గేర్ మార్చాడు. ధనాధన్ ఆడుతున్నాడు. తనకి ఫస్ట్ ఇన్నింగ్స్ చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ అండగా ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా కనీసం 500 పరుగుల టార్గ్ ట్ అయినా ఇంగ్లాండ్ కి ఇవ్వాలనే ప్లాన్ తో ఉంది. ప్రస్తుతం 403 పరుగుల లీడ్ తో ఉంది.

బ్యాటింగ్ పిచ్ గా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లాండ్ తమకి అచ్చి వచ్చిన బజ్ బాల్ వ్యూహంతో వెళ్లి క్లిక్ అయితే, టీమ్ ఇండియాకి పరాజయం తప్పదు. అందుకనే రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. టీ బ్రేక్ తర్వాతైనా సరే, ఇంగ్లాండ్ కి బ్యాటింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×