EPAPER

IND vs AUS: మేమంటే మేం.. రికీ పాంటింగ్ వర్సెస్ రవిశాస్త్రి

IND vs AUS: మేమంటే మేం.. రికీ పాంటింగ్ వర్సెస్ రవిశాస్త్రి

IND vs AUS Ravi Shastri rubbishes Ricky Ponting’s Claims: రెండు దేశాల ఇద్దరు లెజండరీ క్రికెటర్ల మధ్య వార్ మొదలైంది. మావాళ్లు గొప్పంటే, మావాళ్లు గొప్ప, మావాళ్లే గెలుస్తారంటే, మావాళ్లే గెలుస్తారని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. నవంబర్ నెలలో ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది.


ఇందులో భాగంగా టీమ్ ఇండియా ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవడానికి.. రెండు దేశాలకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారనుంది.

వన్డే ప్రపంచకప్, టీ 20 ప్రపంచకప్ తరహాలోనే టెస్టు మ్యాచ్ లపై కూడా ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలను ఐసీసీ నిర్వహిస్తొంది. ఇందులో భాగంగా డబ్ల్యూటీసీ ర్యాంకింగుల ప్రకారం మొదటి రెండు స్థానాల్లో భారత్, ఆస్ట్రేలియా ఉన్నాయి.


ఇప్పటివరకు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లు జరిగాయి. రెండింట్లో భారత్ రన్నరప్ గా నిలిచింది. మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే, రెండోది ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

ఇప్పుడు ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ చాలా కీలకంగా మారనుంది. ఇందులో మ్యాచ్ లు ఎక్కువ గెలిస్తే ఫైనల్ బెర్త్ కన్ ఫర్మ్ అవుతుంది. అందుకనే ఈసారి రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు.

ఈసారి ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీకాదని అన్నాడు. భారత్ ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో ఓడించడం ఖాయమని అన్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందని జోస్యం చెప్పాడు. ఇప్పుడీ మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనికి కౌంటర్ గా భారత లెజండరీ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించాడు. రికీ పాంటింగ్ అంచనా తప్పని అన్నాడు.

Also Read: అంత బిల్డప్ అవసరమా?.. వినేశ్ ఫోగట్ తీర్పుపై నిరసనల వెల్లువ

టీమ్ ఇండియా ఇప్పుడు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని అన్నాడు. అటు బౌలింగు, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ ల్లో అద్భుతంగా రాణిస్తోందని తెలిపాడు. టీ 20 ప్రపంచకప్ లో సూర్య కుమార్ పట్టిన క్యాచ్ ఎలా మ్యాచ్ ని మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందేనని అన్నాడు. ఈ ట్రోఫీని రెండు సార్లు టీమ్ ఇండియా సాధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోందని అన్నాడు.

2018-19, 2020-21 ల్లో జరిగిన సిరీస్ లను భారత్ సొంతం చేసుకుంది. అప్పుడు భారత్ కోచ్ గా రవిశాస్త్రి ఉన్నాడు. ఇప్పుడు 2014-15 మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని రూల్ ప్రకారం భారత్ గెలుస్తుందని ఢంకా భజాయించి రవిశాస్త్రి చెప్పడం విశేషం. మరేం చేస్తారో మనోళ్లు చూడాల్సిందే.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×