EPAPER

IPL : రాజస్థాన్ రాయల్స్ జోరు.. ఢిల్లీ హ్యాట్రిక్ పరాజయాలు..

IPL : రాజస్థాన్ రాయల్స్ జోరు.. ఢిల్లీ హ్యాట్రిక్ పరాజయాలు..

IPL : IPL 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఓటమిని చవిచూసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 57 పరుగుల తేడా చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, బట్లర్ మరోసారి చెలరేగి ఆడారు. తొలి వికెట్ కు 8.3 ఓవర్లలోనే 98 పరుగులు జోడించారు. అదే స్కోర్ వద్ద జైస్వాల్ ( 60, 31 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సు) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శాంసన్ (0), రియాన్ పరాగ్ (7) తక్కువ స్కోరుకే అవుటైనా.. హెట్మెయర్ తో కలిసి బట్లర్ విధ్వంసం కొనసాగించాడు. బట్లర్ ( 79, 51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సు) , హెట్మెయర్ (39, 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులు) చెలరేగడంతో రాజస్థాన్ భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 2 వికెట్లు తీయగా.. కులదీప్, పావెల్ చెరో వికెట్ తీశారు.


200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పరుగులు ఖాతా తెరవకుండా పృద్వీ షా (0), మనీష్ పాండే (0) వికెట్లు కోల్పోయింది. బౌల్ట్ దెబ్బకు ఈ ఇద్దరూ బ్యాటర్లు పెవిలియన్ కు చేరారు. రీలీ రోసౌ (14) కూడా విఫలం కావడంతో ఢిల్లీ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. లలిత్ యాదవ్ (38, 24 బంతుల్లో 5 ఫోర్లు) తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. అయితే ఆ తర్వాత అక్షర్ పటేల్ (2), పావెల్ (2) విఫలం కావడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైంది. చివరి వరకు వార్నర్ ( 65, 55 బంతుల్లో 7 ఫోర్లు) పోరాటం కొనసాగించాడు. చివరకు ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 142 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో గెలిచింది.

రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లు , సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన రాజస్థాన్ .. రెండో మ్యాచ్ లో ఓడింది. ఇప్పుడు మళ్లీ గెలుపుబాట పట్టింది. ఢిల్లీ మాత్రం ఇంకా శుభారంభం చేయలేదు. హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. గుజరాత్, పంజాబ్ జట్లు మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచాయి.


Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×