EPAPER

IND vs SL : అతని కోసం.. రంగంలోకి దిగిన ద్రవిడ్..

IND vs SL : అతని కోసం.. రంగంలోకి దిగిన ద్రవిడ్..

IND vs SL : వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియా దూసుకుపోతోంది. ఈ సమయంలో ఒక బ్యాట్స్ మెన్ త్వరగా అవుట్ అయిపోవడం టీమ్ ఇండియాని కలవరపెడుతోంది. దీంతో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ రంగంలోకి దిగాడు. అతనికి దగ్గరుండి కోచింగ్ ఇవ్వడానికి నడుం బిగించాడు. ఉదయం నుంచి తనే నెట్స్ లో ఉండి, తను ఏ బాల్స్ కి అయితే అవుట్ అవుతున్నాడో, అదే బాల్స్ వేసి ఎలా ఆడాలో నేర్పించి చూపించాడు.


అలా ద్రవిడ్ డైరక్షన్ లో స్పెషల్ బౌన్సర్ ట్రైనింగ్ సాగింది. ఇంతకీ అతనెవరంటే శ్రేయాస్ అయ్యర్. శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో అయ్యర్ పై వేటు పడే అవకాశాలున్నాయనే వార్తలు రావడంతో నెట్స్ లో తను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తనతోపాటు ఇతర క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ సెషన్ లో తీవ్రంగా కష్టపడ్డారు.

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ కి హాజరుకాలేదు. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అందరూ అయ్యర్ మీదే కాన్ సంట్రేషన్ చేయడంతో తను కూడా షార్ట్ పిచ్, బౌన్సర్ డెలివరీలను అవలీలగా ఎదుర్కొన్నాడు. వాటిని భారీ సిక్సర్లుగా మలచడంతో మేనేజ్మెంట్ హ్యాపీగా  ఉంది. మనవాడు దారిలో పడ్డాడని భావిస్తున్నారు.


ఫుల్ షాట్ లేదా హుక్ షాట్లు ఆడే క్రమంలో అయ్యర్ అవుట్ అయి పెవిలియన్ చేరుతున్నాడు. గాయం తర్వాత క్రికెట్లోకి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చినా మెగా టోర్నీలో తను ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.. ఆరు మ్యాచ్ ల్లో ఒకే ఒక ఆఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడీ ఫిగర్సే తన కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేసేలా ఉన్నాయని అంటున్నారు. మిగిలిన అందరూ ఆకట్టుకుంటున్నారు. ఒక్క అయ్యర్ కూడా సెట్ అయితే ప్రపంచకప్  సాధించడం ఇండియాకి పెద్ద లెక్కలోనిది కాదని అంటున్నారు. హార్దిక్ పాండ్యా వస్తే టీమ్ ఇండియా నుంచి బయటకి వెళ్లే పేర్లలో ఒకటి అయ్యర్, రెండు సిరాజ్ అని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×