EPAPER
Kirrak Couples Episode 1

ICC World Cup 2023 : సెమీస్‌‌కు చేరేదెవరు.. ఈరోజే తేలిపోనుందా?

ICC World Cup 2023 : సెమీస్‌‌కు చేరేదెవరు.. ఈరోజే తేలిపోనుందా?

ICC World Cup 2023 : వరల్డ్ కప్ 2023 పోరాటం మూడొంతులు పూర్తయినట్టే. ఇక చివరి అంకంలోకి వచ్చిందనే చెప్పాలి. ఈరోజు జరగబోయే రెండు మ్యాచుల్లో సెమీస్‌కు వెళ్లే జట్లు ఏవనేది తేలిపోయేలా ఉంది. దాంతో మిగిలిన 4 జట్లు ఇంటి దారి పట్టనున్నాయి. అవి ఏ జట్లు? ఇంకా సెమీస్ అవకాశాలు ఎవరికున్నాయి?


శనివారం నాడు మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆడనున్నాయి. మొదట పాక్-కివీస్ మధ్యపోరు నువ్వా నేనా అన్నట్టు ఉండేలా ఉంది. ఎందుకంటే కివీస్ 8 పాయింట్లతో ఉంది.

టోర్నీని మొదట్లో ఘనంగా ప్రారంభించి వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి, తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఓటములతో పడుతూ లేస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ 6 పాయింట్లతో ఉంది. ఇప్పుడు కివీస్‌పై గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. సమానం అవతుంది.


తర్వాత జరిగే ఆఖరి మ్యాచ్ ఇద్దరికీ నిర్ణయాత్మకం అవుతుంది. అంతవరకు తెచ్చుకోకూడదని కివీస్ భావిస్తోంది. కేన్ విలియమ్సన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. గాయం మళ్లీ తిరగబెట్టడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పేసర్ హెన్రీ గాయంతో మిగతా టోర్నీకి దూరమయ్యాడు. ఇది కివీస్‌కు గట్టి దెబ్బ అని చెప్పాలి.

ఇక ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య దాయాదుల పోరు మొదలవనుంది. ఇంతవరకు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తూ చిన్న జట్ల కన్నా అధ్వానంగా ఆడుతూ అట్టడుగు స్థానానికి చేరిపోయిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్ విదిల్చిందంటే ఆస్ట్రేలియాకి చుక్కలు కనిపిస్తాయి.

ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి.. తర్వాత పికప్ అందుకుని వరుసగా నాలుగు గెలిచింది. కాకపోతే 40 బాల్స్‌లో సెంచరీ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన మాక్స్‌వెల్ గాయంతో వెనుతిరిగాడు. వ్యక్తిగత కారణాలతో సెంచరీ వీరుడు మిచెల్ మార్ష్ ఇంటికెళుతున్నాడు. ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్‌తో కలిసి వరల్డ్ కప్‌లో బ్రహ్మాండమైన పార్టనర్‌షిప్‌లు నడిపించాడు. ఇప్పుడు వీరిద్దరూ వెళ్లడం ఆస్ట్రేలియాకు దెబ్బే.

ఇక్కడ వీటన్నింటికి ఒకటే పరిష్కారం ఉంది. ఈరోజు జరగబోయే నిర్ణయాత్మక మ్యాచ్ ల్లో అటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ గానీ విజయం సాధిస్తే సెమీస్ కి చేరే అవకాశాలున్నాయి. అప్పుడు మిగిలిన నాలుగు జట్లు వెనక్కి మళ్లుతాయి. అవి పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్, నెదర్లాండ్స్.

వీటిలో ఆఫ్గనిస్తాన్ మరో రెండు మ్యాచ్ లు ఆడాలి. అదిప్పటికే 8 పాయింట్లతో ఉంది. ఒకవేళ ఏదైనా సంచలనం నమోదైతే.. అప్పుడు సెమీస్ సమీకరణాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ మధ్య మారతాయి.

Related News

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Big Stories

×